English | Telugu
హీరో అవ్వడానికి ఏ స్కూల్ కి వెళ్ళాలి...
Updated : Mar 26, 2024
విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" మూవీ ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో విజయ దేవరకొండ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గానే చేస్తున్నాడు. రీసెంట్ గా కొంత మంది బుల్లితెర నటీమణులతో ముచ్చట్లు పెట్టి వెరైటీగా మూవీ ప్రొమోషన్ చేసాడు. ఐతే అందులో యాట నవీన తన పిల్లల్ని తీసుకొచ్చి విజయ్ దేవరకొండను చూపించింది. దాంతో వాళ్ళు నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. విజయ్ కూడా ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలి అని వాళ్ళను విష్ చేసాడు.
ఐతే నవీన చిన్న కొడుకు మాత్రం వెరైటీగా ఒక ప్రశ్న వేసాడు "హీరో అవ్వడానికి ఏ స్కూల్ కి వెళ్ళాలి" అని అడిగాడు. "హీరో అవ్వాలంటే అన్నీ బాగా చేయాలి..స్కూల్ కి వెళ్లి మంచిగా చదువుకోవాలి. అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి. మంచిగా తినాలి. మంచిగా పడుకోవాలి..బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి అంటే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడాలి." అని చెప్పాడు. "అన్నా అమ్మ వాళ్ళను అసలు ఎలా ఇంప్రెస్ చేయాలి" అని మళ్ళీ ఆ పిల్లాడు అడిగాడు. "అమ్మలను ఇంప్రెస్ చేయడమే చాలా ఈజి.. లాంగ్ డే షూట్ కి వెళ్లి వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అప్పుడు అమ్మకు ఒక హగ్ ఇవ్వాలి. అంతే అమ్మావాళ్లు కూల్ ఐపోతారు. ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. "మీరు సినిమాలో ఇంట్లో అన్ని పనులు చేస్తున్నట్టు కనిపించారు..నిజంగా ఇంట్లో కూడా ఇవన్నీ చేస్తారా" అని నవీన పెద్ద కొడుకు అడిగేసరికి "నేను హాస్టల్ లో ఉన్నప్పుడు చేసేవాడిని.. ప్రతీ సండే అమ్మతో మార్కెట్ వెళ్లి కూరగాయలు తెచ్చేవాడిని. ఇప్పుడు స్టార్ ని అయ్యాను కదా..ఉదయం లేచాక చేయాల్సిన వేరే పనులే ఎక్కువగా ఉంటాయి." అని చెప్పాడు..ఇక తన చిన్నప్పుడు విజయ్ వాళ్ళ అమ్మ ట్యూషన్స్ చెప్పేవారని అప్పుడు బిగినర్స్ కి విజయ్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకునేవాడట. అలా వాళ్ళ అమ్మ 500 ఇచ్చేవారట ఒక సెషన్ కి. ఆ విధంగా పాకెట్ మనీ సంపాదించుకునే వాడిని అని చెప్పాడు.