English | Telugu
Karthika Deepam2 : కార్తిక్ ప్రాణాలు కాపాడిన దీప.. తండ్రి కోసం వంటలక్కగా మారిందా!
Updated : Mar 27, 2024
కార్తీక దీపం సీరియల్ ఇది తెలుగు వారి ఎమోషన్ అని చెప్పొచ్చు. దీనికి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇది నవ వసంతం అంటు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కార్తీక దీపం సీజన్-2. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -2 లో.. గొప్పింటి బిడ్డగా బతకాల్సిన దీప కాస్తా పారిజాతం చేసిన కుట్రకు బలై ఎక్కడో కుబేరుడు అనే పేదవాడి ఇంట్లో పెరుగుతుంది.
కుబేరు సొంతకూతురు కాకపోయిన దీపని గొప్ప చదువులు చదివించి కలెక్టర్ చెయ్యాలని ఆశపడతాడు. ఇక మరొకవైపు దీప స్థానంలో రాజభోగాలు అనుభవిస్తుంటుంది పారిజాతం మనవరాలు జ్యోత్స్న. ఒకరోజు కార్తీక్, జ్యోత్స్నలని తీసుకొని సుమిత్ర గుడికి వెళ్తుంది. అక్కడ గుడిలోని కోనేటిలో జ్యోత్స్నకి తామరపుష్పం కన్పిస్తుంది. తామర పుష్పం కావాలని జ్యోత్స్న అడుగగా.. నాకు నీళ్లంటే భయమని కార్తీక్ చెప్పిన జ్యోత్స్న వినకుండా కావాలని అనడంతో కార్తీక్ నదిలోకి దిగి మునిగిపోతుంటుంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న దీప చూసి.. కోనేటిలో దిగి కార్తీక్ ని బయటకు తీసుకొచ్చి కాపాడుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి అల్లుడు కార్తీక్ ప్రాణాలని కాపాడిన దీపతో మాట్లాడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వెళ్లిపోతూ దీప దగ్గరికి వచ్చి.. థాంక్స్ కాపాడినందుకు అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. నీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తానని కార్తిక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ వెళిపోతు తన జేబులో పడిపోయిన దీప గొలుసు చూస్తాడు.
మరొకవైపు దీప చదువుకుంటు ఉంటే.. కుబేరుడు దీప మెడలో గొలుసు లేదని అడుగుతాడు. నేను ఒక అతన్ని కాపాడాను కదా అప్పుడే పోయిందేమో నాన్న అని దీప అంటుంది. అది నీ తల్లి జ్ఞాపకం.. మళ్ళీ నీ దగ్గరికి వస్తుందని కుబేరుడు అంటాడు. ఆ తర్వాత కుబేరుడి వాళ్ళ అక్క వచ్చి.. నీ కోసం నా తమ్ముడు కష్టపడుతున్నాడని దీపని తిడుతుంది. దాంతో దీప తన బుక్స్ అన్ని తన ఫ్రెండ్ కి ఇస్తుంది. ఇక నేను చదువుకోను మీకు హెల్ప్ చేస్తానని కుబేరుడికి మాటిస్తుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దీప వంటలు చేస్తు అందరికి కడుపు నిండా భోజనం పెడుతుంది. ఆ తర్వాత తన కూతురు శౌర్య దగ్గరికి వెళ్లి జాతరకి వెళదాం.. అక్కడ సైకిల్ కనుక్కోవాలని చెప్తుంది. మరి అక్కడ నాన్న ఉంటాడా అని శౌర్య అడుగుతుంది. దీప సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడ నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.