English | Telugu

అందాల ఆరబోతలో డోస్ పెంచిన జబర్దస్త్ వర్ష!

బుల్లితెరపై వర్ష తన అందంతో తిరుగులేని ఫాలోయింగ్, క్రేజ్‌ను దక్కించుకుంది. యాక్టింగ్,డ్యాన్స్ ఇలా అన్నింట్లో నెటిజన్లు ఆమెకు తక్కువ మార్కులు వేస్తుంటారు. కానీ అందంలో మాత్రం ఎక్స్‌ట్రా మార్కులు వేస్తుంటారు. అలా వర్ష తన అందాల ప్రదర్శనతో నెట్టింట్లో దుమ్ములేపేస్తుంటుంది.

బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రయాణం మొదలుపెట్టి.. జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చింది వర్ష. ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీగా తిరుగుని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. గత ఆరేడేళ్లుగా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తోంది. పండుగ ఈవెంట్లు, బుల్లితెరపై షోలు అంటూ బాగానే బిజీగా ఉంటోంది. ఇక నెట్టింట్లో వర్ష తన అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. వర్షకి ఇన్ స్టాగ్రామ్ లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇప్పుడు ఏ పోస్ట్ చేసినా, ఏ రీల్ చేసిన తక్కువలో తక్కువ ముప్పై వేల లైక్లు.. వన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అటు యూట్యూబ్ లో వ్లాగ్స్.. ఇటు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోషూట్స్, రీల్స్ తో ఎప్పుడు నెటిజన్లకి దగ్గరగా ఉంటుంది ఈ భామ.

తాజాగా వర్ష తన ఇన్ స్టాగ్రామ్ లో రెడ్ కలర్ చీరలో కొన్ని ఫోటోలని షేర్ చేసింది‌. వాటిల్లో కొన్ని ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. రెస్పెక్ట్ ట్రాన్స్ జెండర్ అంటు, మీరు సూపర్ సర్ అంటూ కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తుంటే.. లుకింగ్ లైక్ ఏంజిల్, బ్యూటిఫుల్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.