English | Telugu

ఐదేళ్ల ప్రేమాయణం...ఫైమాకి రింగ్ పెట్టేసిన లవర్


జబర్దస్త్ ఫైమా అంటే ఆడియన్స్ కి పరిచయమే. బుల్లితెర మీద సోషల్ మీడియాలో అమ్మడు ఫుల్ పాపులర్. రీసెంట్ గా ఫైమా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు చాలా మంది విషెస్ చెప్పారు. అలాగే ఆమె ప్రియుడు ప్రవీణ్ కూడా బర్త్ డే విషెస్ చెప్పాడు. జబర్దస్త్ కమెడియన్స్ , ఫాన్స్, ఫాలోవర్స్ అంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఐతే బర్త్ డే రోజున ఫైమా లవర్ ప్రవీణ్ నాయక్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫైమా చేతికి రింగ్ పెట్టాడు. అలాగే రెడ్ కలర్ హార్ట్ సింబల్ పిల్లో కూడా ఇచ్చాడు. ఆ పిక్స్ చూసి అంతా ఎంగేజ్మెంట్ అయ్యిందా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రవీణ్ నాయక్ పెట్టిన కాప్షన్ కూడా ఎంగేజ్మెంట్ ఐపోయిందనే అర్థాన్నీ ఇస్తోంది. “హ్యాపీ బర్త్ డే మై లవ్.. అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయో తెలీదు. నా జీవితం మొత్తం నీతో గడపాలని ఉంది. ఐ లవ్ ఫరెవర్ కన్నా” అంటూ రాసుకొచ్చాడు.

ఈ పోస్టుకు ఫైమాని కూడా ట్యాగ్ చేశాడు. ఫైమాకి బర్త్ డే విషెస్ చెప్తూనే పటాస్ ప్రవీణ్ గురించి అడుగుతున్నారు అలాగే ఫైమాని తిడుతున్నారు కూడా. ప్రవీణ్ మీద తనకు లవ్ ఫీలింగ్ లేదని గతంలో చెప్పేసింది ఫైమా. ఆన్ -స్క్రీన్ కోసమే జంటగా నటించామన్నారు. ఫైమా పుట్టినరోజు సందర్భంగా పటాస్ ప్రవీణ్ ఫైతో కలిసి చేసిన ఒక రీల్ ను ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. ఐతే నెటిజన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. "ప్రవీణ్ ని బకరాని చేసావ్..అతన్ని బాగా యూజ్ చేసుకున్నావ్" అంటూ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఫైమా జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఫైమా ఆటిట్యూడ్ లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతానికి ఏ షోలో కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలోనే రీల్స్ చేస్తూ ఉంది ఫైమా.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.