English | Telugu

Guppedantha Manasu : వసుధార కోసం సరోజకి వార్నింగ్ ఇచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1121 లో....సంజీవయ్య ఊళ్ళో కొందరిని తీసుకొని.. రంగా ఇంటికి వస్తాడు. వాళ్ళు అసలు ఈ ఇంట్లో ఉంటున్న అమ్మాయి ఎవరు తనకి రంగాకి సంబంధమేంటని అడుగుతారు. ఎవరో రౌడీలు వెంబడిస్తుంటే బావ తనని కాపాడి తీసుకొని వచ్చాడని సరోజ అంటుంది. ఆ అమ్మాయికి రంగాకి మధ్య ఏదైనా ప్రేమ లాంటి వ్యవహారం ఉంటే పట్టించుకునే వాళ్ళం కాదు కానీ అలా ఇంట్లో ఎవరో తెలియని అమ్మాయి ఉంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఊరుకోరని వాళ్ళు అంటారు.

అప్పుడే రంగా వచ్చి.. మేడమ్ గారు ప్రాబ్లెమ్ లో ఉన్నారు. అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చానని రంగా అంటాడు. సరోజ కూడా వస్తుంది కదా అని రంగా అనగానే.. ముక్కు మొహం తెలియని దాంతో నా కూతురికి పోలికేంటని సంజీవయ్య అంటాడు. అది కాదు రంగా.. సంజీవయ్య ఒప్పుకుంటే సరోజతో నీ పెళ్లి జరిగుతుందని ఒకావిడ అనగానే.. ఏం లేని వాడికి నా కూతురిని ఇచ్చి వివాహం చేస్తానా....నా కూతురితో వీడి పెళ్లి చేసి డబ్బులు ఎగ్గొడదామని చూస్తుంది ఈ పెద్దావిడ అని సంజీవయ్య అంటాడు. నేనేం నీ కూతురిని చేసుకోవాలి అనుకోవట్లేదని రంగా అనగానే.. ఇప్పుడు మన గురించి టాపిక్ కాదు.. వాళ్ళు ఆ పిల్లని ఎందుకు ఇంట్లో ఉంచుకుంటున్నారని అడుగుతున్నారని సరోజ అంటుంది. ఆ తర్వాత రంగా క్లియర్ గా చెప్పాడు కద.. ఇక వెళదామని వాళ్ళు వెళ్ళిపోతారు. అదంతా వసుధార చూస్తూ ఉంటుంది. మరొకవైపు డాడ్ మనకి ఎందుకు సపోర్ట్ చేసారో తెలుసా అని శైలేంద్ర అంటాడు. ఎందుకు అని దేవయాని అంటుంది. రిషి, వసుధారలు లేరు. ఇక కాలేజీకీ నేను తప్ప వేరే ఎవరు లేరని శైలేంద్ర అంటాడు. ఇద్దరు కలిసి మహేంద్రని ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తారు.

మరొకవైపు ఆ అమ్మాయి వల్ల మనకి ఎందుకు ఇన్ని ఇబ్బందులు.. తను నిన్ను కాపాడింది.. నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కానీ ఊళ్ళో వాళ్లు అలా అంటున్నారని రంగాతో పెద్దావిడ అంటుంది. ఇదంతా నా వల్లే సర్.. మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు. మీరు నా రిషి సర్ అని వసుధార అనగానే.. సరోజకి వసుధారకి గొడవ జరుగుతుంది. ఇంకొకసారి మేడమ్ ని ఏం అనకంటూ సరోజకి వార్నింగ్ ఇస్తాడు రంగా. ఆ తర్వాత అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అని మహేంద్రని మను అడుగుతాడు. ఏం గొడవ లేదు వదినకి అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి వాళ్ళ విషయం లో జోక్యం చేసుకోకని.. అంతే కాకుండా మను ప్రాబ్లమ్ క్లియర్ చెయ్యమని చెప్పాడు. ఇక మీ అమ్మ ఇష్టం.. ఇప్పటికైనా నిజం చెప్తుందో లేదో చూడాలని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.