English | Telugu

ఈ వారం బుల్లితెర ధారావాహికల్లో టాప్-5 సీరియల్స్ ఇవే!

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి‌ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను కొత్తగా మొదలైన కార్తీకదీపం-2 కి ఫ్యాన్ బేస్ అంతగా రాలేదనే చెప్పాలి. ఈ వారం టీఆర్పీలో అగ్రస్థానంలో 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'కార్తీకదీపం-2', మూడవ స్థానంలో ' గుండె నిండా గుడిగంటలు' ఉండగా.. నాల్గవ స్థానంలో ' ఇంటింటి రామాయణం' ఉంది. ఆ తర్వాత అయిదవ స్థానంలో కొత్త సీరియల్ ' సత్యభామ' ఉంది.

గత కొన్ని నెలలుగా స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. దీనికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఆన్ స్క్రీన్ పై రాజ్-కావ్యల మధ్య బాండింగ్ ఉంది. అలాగే దుగ్గిరాల ఇంట్లో సాగే ఎమోషనల్ సీక్వెన్స్ సీన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య సాగే గొడవలు.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. కనకం, కృష్ణమూర్తిల మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్.. తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. బొమ్మలకి రంగులు వేసుకుంటూ కృష్ణమూర్తి కనకం ఇద్దరు తమ ఇద్దరు కూతుళ్ళు కావ్య, స్వప్నలని చదివించి దుగ్గిరాల ఇంటి కోడళ్ళుగా చేశారు. కావ్యని దుగ్గిరాల ఇంట్లో మొదట అందరు ద్వేషించేచారు. ఇక కొన్ని ఎపిసోడ్ ల ముందు వరకు కావ్యని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవీ, సీతారామయ్య, సుభాష్, కళ్యాణ్ లు ఇష్టపడగా.. అనామిక ఇంట్లోకి వచ్చాక ధాన్యలక్ష్మి మనసు పూర్తిగా మారిపోయింది. ‌ఇక అనామిక ఏం చెప్పిన చేస్తున్న ధాన్యలక్ష్మి..నిత్యం తిట్లు తింటూనే ఉంది. ఇక తాజా ఎపిసోడ్ లలో కోర్ట్ రూమ్ డ్రామా సాగుతుంది. కళ్యాణ్, అప్పులు అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్త తనని టార్చర్ చేస్తున్నాడంటూ అనామిక కేసు పెట్టగా.. కావ్య ఇచ్చిన కీలకమైన ఆధారాలు అనామికని ప్రాబ్లమ్ లోకి నెట్టాయి. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంది. ఇక శౌర్య నాన్న ఎవరో అనే చర్చతో కార్తీకదీపం-2 మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇది రెండవ స్థానంలో ఉంది.

ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ మూడవ స్థానంలో ఉండగా.. కొత్తగా మొదలైన ఇంటింటి రామాయణం నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. వేద, యష్ ల జోడీ మరోసారి ఆన్ స్క్రీన్ హిట్ జోడిగా నిలవగా ' సత్యభామ' సీరియల్ టాప్-5 లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం బ్రహ్మముడి మొదటి స్థానంలో, కార్తీకదీపం-2 రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి.