English | Telugu

Illu illalu pillalu: నర్మదని అర్థం చేసుకున్న వేదవతి.. ప్రేమ వెళ్ళిపోయింది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో... నర్మద ఇంటికి వస్తుంది. తనని చూసి భద్రవతి, సేనాపతి నవ్వుకుంటారు. నిన్న ఏదో నీతులు మాట్లాడింది.. ఈ రోజు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని సేనాపతి అంటాడు. వాళ్ళ మాటలకి నర్మదకి కోపం వచ్చినా కూడా సైలెంట్ గా లోపలికి వెళ్తుంది.

ఇంట్లో అందరు నర్మద కోసం వెయిట్ చేస్తారు. ధీరజ్ ఏమైంది వదిన అని అడుగుతాడు. ఏమైంది నర్మద న్యూస్ లో వచ్చింది నిజమేనా నిజమే అయి ఉంటుందిలే.. ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తారులే.. పాపం మావయ్య పరువు గురించి కూడా ఆలోచించాలి కదా అని శ్రీవల్లి అనాల్సిన మాటలన్నీ అంటుంది. ఇప్పుడు హ్యాపీనా అని నర్మద అనేసి లోపలికి వెళ్తుంది.

ఆ తర్వాత నర్మద డల్ గా కూర్చొని ఉంటుంది. ఎందుకు ఇలా చేసావని వేదవతి వచ్చి అనగానే అత్తయ్య నేను తప్పు చేసానని అనుకుంటుందా అని నర్మద అనుకుంటుంది. నువ్వు లంచం తీసుకోలేదు అయినా ఎందుకు ఎదురు తిరగలేదు.. నిన్ను ఈ కేసు లో ఇరికించింది మా వాళ్లే కదా.. ప్రేమ, నేను గుర్తువచ్చి ఎదురు తిరగలేదు కదా అని వేదవతి అనగానే నర్మద తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది.

నాకు ఈ ఇంట్లో ప్రేమ, మీరు మాట్లాడకపోతే ఒంటరిని అవుతానని నర్మద అంటుంది. నువ్వు మా గురించి ఏం ఆలోచించకు.. ఈ కేసు నుండి బయటపడడానికి ఏం చెయ్యాలో అది చెయ్ అని వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ వచ్చి కూడా మా గురించి ఆలోచించకు అక్క అని చెప్పి సపోర్ట్ చేస్తుంది.

ఆ తర్వాత మీ వాళ్ళు మా వదిన జాబ్ పోయేలా చేశారని ప్రేమతో ధీరజ్ అంటాడు. దాంతో మా ఇంటికి వెళ్లిపోతున్నానని ప్రేమ అక్కడ నుండి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ధీరజ్ షాక్ అవుతాడు. అదంతా భాగ్యం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.