English | Telugu

Jayam Serial: పారుని చూసి ఇంట్లో వాళ్లు షాక్.. పెళ్ళికి ఓకే చెప్పేసిన రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -107 లో... రుద్రకి శకుంతల అమ్మాయిని చూసిందని ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. అన్నయ్య పెళ్లికి నేనే రెడీ చేస్తానని ఒకరు, షాపింగ్ చేస్తానని ఇంకొకరు ఇలా రుద్రని ఆటపట్టిస్తారు. నా కొడుకుని ఇబ్బంది పెట్టకండి అని రుద్రపై శకుంతల లేని ప్రేమని చూపిస్తుంది. అదంతా రుద్ర ఇంకా ఇంట్లో వాళ్లు నిజమని నమ్ముతారు.

ఇంతకు అమ్మాయి ఎవరు.. అమ్మాయి పేరు అయిన చెప్పు పెద్దమ్మ అని స్నేహ వాళ్ళు అడుగుతారు. అప్పుడే పార్వతి అంటూ పారు ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఎందుకు వచ్చావ్.. మా అన్నయ్య హ్యాపీగా ఉంటే చూడలేవా.. ప్రతీదానికి వచ్చి ఇలా ఇర్రిటేట్ చేస్తావని ప్రీతీ కోప్పడుతుంది.

ఎందుకు వచ్చావ్.. సారీ చెప్పడానికి వచ్చావా అని ప్రీతీ అడుగుతుంది‌‌‌. కాదు కన్యాదానం చెయ్యడానికి వచ్చానని పారు వాళ్ళు అనగానే అందరు షాక్ అవుతారు. అంటే శకుంతల నువ్వు చూసింది ఈ అమ్మాయినా అని పెద్దసారు అడుగుతాడు. అవునని శకుంతల అంటుంది. నువ్వు ఏదో అన్నయ్యని అర్థం చేసుకునే భార్యని తీసుకొని వస్తావని అనుకుంటే ఇలా అన్నయ్యని వద్దనుకొని వెళ్ళిపోయినా దాన్ని తీసుకొని వచ్చావా అని ప్రీతీ అంటుంది.

తరువాయి భాగంలో ఈ పెద్దమ్మ తీసుకున్న నిర్ణయం నీకు తప్పు అనిపిస్తుందా అని రుద్రని శకుంతల ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ ఎంగేజ్ మెంట్ నాకు ఇష్టమేనని రుద్ర అంటాడు. రుద్ర ఒప్పుకోవడంతో తాంబులాలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.