English | Telugu

Karthika Deepam 2: కొత్త సీఈఓ దీప.. జ్యోత్స్న, పారిజాతం షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -510 లో... దీప కిచెన్ లో వంట చేస్తుంది. అక్కడికి పారిజాతం వెళ్లి తనని మాటల్లో పెట్టి కొత్త సీఈఓ కార్తీక్ ఆ కాదా? అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. నాకేం తెలియదని దీప చెప్తుంది.

మరొకవైపు పాత సీఈఓ అయిన జ్యోత్స్న సీఈఓగా కొనసాగడానికి ఎవరు ఒప్పుకోరు.. దాంతో కార్తీక్ ని శివన్నారాయణ పిలిపిస్తాడు. బావనే కొత్త సీఈఓ దీన్ని ఎలాగైనా ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది. బావ సీఈఓగా ఉండడం నాకు ఇష్టం లేదు.. అగ్రిమెంట్ లో అంతా నా ఇష్టప్రకారం అని ఉంది.. నన్ను కాదని బావ ఒప్పుకోడు అని జ్యోత్స్న అంటుంది. ఏం కార్తీక్ చెప్పు నువ్వేమంటావని శివన్నారాయణ అడుగుతాడు. అగ్రిమెంట్ నియమాలకి కట్టుబడి ఉంటానని కార్తీక్ అంటాడు.

అయినా కొత్త సీఈఓ కార్తీక్ అని ఎవరు చెప్పారని శివన్నారాయణ అంటాడు. మీరే ఉహించుకున్నారు.. కార్తీక్ ని వేరే పని మీద పిలిచాను.. కొత్త సీఈఓ ఎక్కడ వరకు వచ్చారని శివన్నారాయణ అడుగగా వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. అప్పుడే దీప క్యారియర్ పట్టుకొని వస్తుంది. నా భార్య వచ్చిందని కార్తీక్ చెప్తాడు. అందరం భోజనం చేసాక కంటిన్యూ చేద్దామని శివన్నారాయణ అంటాడు.

దీప రావడంతో దీపనే కొత్త సీఈఓ అని జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే పారిజాతం కి ఫోన్ చేసి దీప కొత్త సీఈఓ అని చెప్తుంది. దాంతో దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసని పారిజాతం అంటుంది.

వెంటనే సుమిత్ర దగ్గరికి వెళ్లి పని మనిషిని సీఈఓ చేశారట, నీ కూతురికి అన్యాయం జరుగుతుంది.. పదా ఆఫీస్ కి వెళదామని పారిజాతం అంటుంది. వాళ్ళ నిర్ణయానికి అడ్డు చెప్పనని సుమిత్ర అంటుంది. అయినా బలవంతంగా తీసుకొని వెళ్లాలని పారిజాతం ప్రయత్నం చేస్తుంది. నా మానవరాలికి అన్యాయం చేస్తే ఎవరినైనా చంపేస్తానని పారిజాతం కత్తి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.