ఏ పీ లోని 140 కరోనా పాజిటివ్ కేసులు, తబ్లీగ్ జమాత్ పుణ్యమే: అధికారులు
ఢిల్లీ సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్టు అయిన వారికి పరీక్షలు నిర్వహించామని, ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని, వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని అధికారులు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. కోవిడ్ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.