English | Telugu
ఇంట్లోనే వుండండి! బయటికివెళ్తే కరోనాకాటు తప్పదు!
Updated : Apr 3, 2020
లాక్ డౌన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని హెచ్చరిస్తూ రాజ్యసభ సభ్యులు సంతోష్ పెట్టిన ట్విట్టర్ వీడియో ఆలోచింపచేస్తోంది.
లాక్ డౌన్ నిబంధన ఉన్నప్పటికీ కూడా తన తల్లి మాటను లెక్కచేయకుండా తనకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పి నిర్లక్ష్యంతో బయటకు వెళ్లి కరోన వైరస్ ను తన వెంట తీసుకొని వచ్చి తన కుటుంబ సభ్యులకు దానిని అంటించటం వల్ల తన తల్లి ప్రాణాలు కోల్పోయే ఒక సందేశాత్మకమైన వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎం.పి. సంతోష్ ఎంతో సందేశాత్మకమైన పోస్ట్ పెట్టారని అభినందిస్తున్నారు.
ఇంక కొంత కాలం ఓపిక అవసరం. నిర్లక్ష్యంగా వ్యవహరించి కుండా, ఇంటి వద్దనే ఉండటమే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా మంచిగా ఉండే విధంగా వ్యవహరించాలని ఎం.పి.కోరారు. కరోనా వైరస్ ప్రబలకుండా వుండేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ ను ప్రజలు సహకరిస్తున్నారని మరి కొంత కాలం ఓపికగా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు.