భారత దేశ తూర్పు తీరాన్ని కరోనా కబళిస్తుందంటున్న బుడత జ్యోతిష్యుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుర్రాడి పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిష్యం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్ఘళంగా వల్లెవేయడం, జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు.