English | Telugu

నాగ మణికంఠ ఎమోషనల్.. యష్మీ మరోసారి వెన్నుపోటు!

బిగ్ బాస్ సీజన్ లో మరో వారం ముగింపుకు వచ్చేసింది. హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ గా ఆదిత్య ఓం బయటకొచ్చాడు.‌ రేపు హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి.‌

ఇక బిగ్ బాస్ మామ రెండు ప్రోమోలు వదిలాడు. అందులో మొదటిది మార్నింగ్ మస్తీ టాస్క్.. ఇందులో‌ మణికంఠ హౌస్ మేట్స్ జాతకాల్నీ చెప్పాడు. ఇదంతా ఫన్ టాస్క్ గా సాగింది. అయితే రెండో ప్రోమో కూడా రిలీజైంది. ' కన్ఫెషన్ రూమ్ ట్విస్ట్' అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే హౌస్ మేట్స్ కి వాళ్ళ ఇంటి నుండి భోజనం వచ్చింది. ఇక యష్మీ, పృథ్వీ, మణికంఠలని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. యష్మీ లోపలికి వెళ్ళగానే.. హౌస్ లో ఎవరంటే ఇష్టమని బిగ్ బాస్ అడుగగా.. పృథ్వీ, నిఖిల్ అని యష్మీ అంది. కన్ఫెషన్ రూమ్ లో జరిగేది స్క్రీన్ మీద చూపించగా.. హౌస్ మేట్స్ అంతా సోఫాలో‌ కూర్చొని చూశారు. ప్రేరణ తన పేరుని యష్మీ చెప్తుందని అనుకొని... నా పేరు చెప్పు‌ అని‌ అనుకుంది. కానీ చెప్పకపోయేసరికి హర్ట్ అయ్యింది. ‌ఇక పృథ్వీని ఎవరంటే ఇష్టమంటే మొదట ఎవరి పేరో చెప్పి ఆ తర్వాత విష్ణుప్రియ పేరుని చెప్పాడు. దాంతో అలిగింది విష్ణుప్రియ.

మణికంఠ ఇంటి నుండి భోజనం, మెసెజ్ వచ్చింది. అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.‌ యష్మీని పిలిచి‌‌.. నిఖిల్, మణికంఠ వాళ్ళ హోమ్ నుండి ఫుడ్ వచ్చింది. ఎవరికి ఇస్తారని అడిగాడు బిగ్ బాస్. కానీ యష్మీ రాంగ్ డెసిషన్ తీసుకుంది. మణికంఠ పేరు కాకుండా నిఖిల్ పేరుని చెప్పింది యష్మీ . మణికంఠ ఫీల్ అయ్యాడు. ఎమోషనల్ అవుతూ.. ప్రియా ఇండియాకి వచ్చిందా.. నాకు ఆ మెసెజ్ ఇంపార్టెంట్.. ప్లీజ్ యష్మీ నా పేరు చెప్పు అంటు మణికంఠ అన్నాడు.‌ ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన మణికంఠ.. ఐ లవ్ యూ ప్రియ అని అరిచేశాడు.