English | Telugu

తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. డ్రోన్ కెమెరాలతో వైసీపీ నేతల హల్చల్ 

తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై ఉన్న నిషేధం. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తాజాగా తీవ్ర దూమారం రేపుతోంది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. తాజాగా అయన మూడు రోజుల క్రితం అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు. అయితే ఈ పాదయాత్ర కార్యక్రమంలో అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.