English | Telugu

బాలయ్య ఫ్యాన్ అయితే ఇలాగే ఉంటుంది.. వైరల్ గా మారిన రాధిక ఇనిస్టా పిక్ 


-రాధిక ఇనిస్టా పిక్ లో ఏముంది
-బాలయ్య ఫ్యాన్స్ ఏమంటున్నారు
-ఆ చిత్రానికి ప్లస్ గా మారబోతుందా!


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna),సీనియర్ నటీమణి రాధిక(Radhika Sarathkumar)..ఈ ఇద్దరు కలిసి జంటగా సిల్వర్ స్క్రీన్ పై చెయ్యలేదు. అప్పట్లో ఈ ఇద్దర్నిజంటగా కలపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ కాంబినేషన్ సెట్ కాలేదు. రాధిక దాదాపుగా అందరి అగ్ర హీరోలతోను జత కట్టి హీరోయిన్ గా తన సత్తా చాటింది. కానీ ఇప్పుడు బాలకృష్ణ డై హార్ట్ అభిమానిగా మారిపోయింది. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం.

నా నటనకి రిటైర్ మెంట్ ఉండదనే రీతిలో రాధిక పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే శ్రీవిష్ణు(Srivishnu)హీరోగా తెరకెక్కుతున్న'కామ్రేడ్ కళ్యాణ్'(Comrade Kalyan)మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలోనే ఆమె బాలకృష్ణ అభిమానిగా కనిపించనున్నారు. ఈ మేరకు బాలకృష్ణ ఫ్యాన్ గా ఉన్న తన లుక్‌ని రాధిక ఇన్‌స్టాలో షేర్ చేశారు. సదరు లుక్ లో ‘జై బాలయ్య’ అని రాసి ఉన్నహెడ్ బ్యాండ్ ని ఆమె ధరించగా బాలకృష్ణ వన్ మాన్ షో మూవీ లో ఒకటైన 'టాప్ హీరో' సినిమా పోస్టర్ ఉంది. ఇప్పుడు ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలకృష్ణ అభిమానులు కూడా జై బాలయ్య అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read: రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది


కామ్రేడ్ కళ్యాణ్' విషయానికి వస్తే ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో అయితే మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ అభిమానిగా రాధిక కనపడటం కామ్రేడ్ కళ్యాణ్ కి అదనపు ఆకర్షణ కానుంది. శ్రీ విష్ణు సరసన మహిమా నంబియార్(Mahima Nambiar)జత కడుతుండగా జానకి రామ్ మారెళ్ల(Ram Marella)దర్శకుడు. వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి తో కలిసి ప్రముఖ రచయిత కోన వెంకట్(KOna venkat)నిర్మిస్తున్నాడు.