English | Telugu
రాజా సాబ్, జన నాయగన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!
Updated : Jan 6, 2026
రాజా సాబ్ వర్సెస్ జన నాయగన్
తెలుగునాట థియేటర్స్ ఇష్యూ
రాజా సాబ్ కి అన్యాయం జరుగుతుందా?
నిర్మాత అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సంక్రాంతికి 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి' ఇలా ఐదు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అదే సమయంలో 'జన నాయగన్', 'పరాశక్తి' అనే రెండు తమిళ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
అయితే 'ది రాజా సాబ్' విడుదలవుతున్న జనవరి 9నే 'జన నాయగన్' విడుదలవుతోంది. దీంతో థియేటర్ల కేటాయింపుకి సంబంధించిన వివాదం గురించి తెలుగునాట విపరీతంగా చర్చ జరుగుతోంది.
తమిళ్ లో 'జన నాయగన్' ఉండటంతో.. అక్కడ 'రాజా సాబ్' ఒకరోజు ఆలస్యంగా జనవరి 10న విడుదలవుతుంది. కానీ, తెలుగులో 'రాజా సాబ్' ఉన్నప్పటికీ, జనవరి 9నే 'జన నాయగన్' విడుదలకు రెడీ అవుతోంది. ఇది డబ్బింగ్ మూవీ, పైగా తెలుగు మూవీ 'భగవంత్ కేసరి'కి రీమేక్. అయినప్పటికీ థియేటర్లను బాగానే కేటాయిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బింగ్ మూవీ, అందునా తెలుగు మూవీకి రీమేక్ అయిన 'జన నాయగన్'కి అన్ని థియేటర్లు ఎలా కేటాయిస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు.
Also Read: పంచతంత్రం.. ఐదుగురు స్టార్స్ తో డైరెక్టర్ మారుతి మల్టీస్టారర్!
జనవరి 14న విడుదలవుతున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో థియేటర్ల ఇష్యూ గురించి అనిల్ సుంకర మాట్లాడారు. "మాకు మిగతా సినిమాల్లా ఎక్కువ థియేటర్స్ అవసరంలేదు. పైగా 23 నుంచి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి. సెకండ్ వీక్ ఫ్రీగానే ఉంటుంది. అయితే 'జన నాయగన్' రావడం అనేది చర్చించదగ్గ విషయమే. వాళ్ళు మన సినిమాకి అక్కడ థియేటర్స్ ఇస్తున్నారంటే ఓకే. మరి వాళ్ళు ఇస్తున్నారా లేదా అనే విషయం నాకు తెలీదు. అదే సమయంలో ఇంకోటి ఆలోచించాలి. థియేటర్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? జనాలు ఎందుకు చూస్తున్నారు? కూడా చూసుకోవాలి కదా. లేకపోతే రిలీజ్ చేసి ఊరికే రెంట్ లు కట్టుకోరు కదా. డబ్బింగ్ సినిమా అంటే మన సినిమా కంటే చాలా బాగుండాలి. అప్పుడే జనాలు వెళ్తారు. నిజంగా సినిమా చాలా బాగుంటే ఎవరేం చేయలేరు." అన్నారు.
అనిల్ సుంకర చెప్పిన పాయింట్ సరైనదే. జనాలు చూడకపోతే ఖాళీ థియేటర్స్ ని ఉంచుకోలేరు కదా. ఫస్ట్ డే థియేటర్స్ కౌంట్ ఎలా ఉన్నా.. కంటెంట్ ని బట్టి, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి.. థియేటర్ల సంఖ్య పెరగడమో తగ్గడమో జరుగుతుంది.