English | Telugu
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ పై రెస్పాన్స్ ఇదే
Updated : Jan 8, 2026
-చిరంజీవి స్పీచ్ పై అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు
-సదరు స్పీచ్ లోని హైలెట్స్ ఏంటి
-పూర్తి డీటెయిల్స్ ఇవే
నిన్న హైదరాబాద్ వేదికగా మెగా విక్టరీ గ్రాండ్ ఈవెంట్ మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సదరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)మాట్లాడుతు మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్(Prabhas)రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ(Raviteja)సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను.అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి.
రాఘవేంద్రరావు గారు, అనిల్(Anil Ravipudi)తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు .. ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి .ఈ సినిమాని వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే...' ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి... ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు.అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియకపోవచ్చు .అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను. అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ వచ్చారు.
Also read: మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా!
తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది.అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్ విషయంలోనూ అనిల్ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఇన్ని సంవత్సరాలకి కుదిరింది. మూవీలో చేసిన మిగతా ఆర్టిస్టులకి కూడా పేరు పేరున నా ధన్యవాదాలని చిరంజీవి చెప్పడం జరిగింది.ఇక చిరంజీవి స్పీచ్ పై సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను మంచి రెస్పాన్స్ వస్తుంది.