English | Telugu

Brahmamudi: అప్పు విషయంలో ధాన్యలక్ష్మి మంచిగా మారుతుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -912 లో... అప్పు తనకి తెలియకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిందని ధాన్యలక్ష్మి కోపంగా ఉంటుంది. సారీ అత్తయ్య నేను చేసింది తప్పేనని ధాన్యలక్ష్మితో అప్పు అంటుంది. నేను క్షమించను.. నన్ను ఇంత మోసం చేస్తారా ఇక నువ్వు ఎప్పుడు పోలీస్ జాబ్ చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి చెప్పగానే అప్పు బాధపడుతుంది.

అప్పు తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడే తన దగ్గరికి కావ్య, రాజ్ వెళ్లి నువ్వు ఆ కేసు గురించి నిర్ణయం తీసుకోవడంలో మా వంతు పాత్ర కూడా ఉంది. అందుకే ఈ ప్రాబ్లమ్ ని మేమే సాల్వ్ చేస్తామని అప్పుతో రాజ్ చెప్తాడు.

ఆ తర్వాత రాజ్ యాడ్ గురించి ప్రమోషన్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్తాడు. ఎప్పుడు ఇలా ప్రమోషన్ చెయ్యలేదు కదా ఈసారి ఏంటని సీతారామయ్య అడుగుతాడు. మేం కేరళ వెళ్లడం వల్ల ఆఫీస్ లో కొంత నష్టం వచ్చింది. అందుకేనని కావ్య చెప్తుంది. అలా ప్రమోషన్ కి బదులు రాహుల్ లాగా క్లయింట్ కి డిస్కౌంట్ ఇస్తే సరిపోతుంది కదా అని స్వప్న అనగానే అలా ఏం వద్దని రాజ్ చెప్తాడు. అలా చేస్తే రాహుల్ ని ఫాలో అయినట్లు ఉంటుందని అనుకుంటున్నాడని రుద్రాణి అంటుంది. అదేం కాదు రాహుల్ లా ఒకసారి చేస్తే ప్రతిసారీ అలాగే చెయ్యాలి లేదంటే నమ్మకం పోతుందని రాజ్ అంటాడు.

మరొకవైపు ధాన్యలక్ష్మి, అప్పుకి టిఫిన్ ఇస్తుంది. ఇది అయిన నేను చెప్పినట్టు చేస్తావా లేక నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ రోజు నేను వచ్చినప్పుడు బెడ్ పై పడుకుంది ఎవరని ధాన్యలక్ష్మి అడుగగా మావయ్య అని అప్పు చెప్తుంది. ఇందులో ఆయన భాగం కూడా ఉందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా రాజ్, కావ్య, ఇందిరాదేవి విని ముగ్గురు కలిసి ఒక ప్లాన్ చేస్తారు.

ఎప్పుడూ అన్నదానం జరిపించే పంతులు ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు. అతనికి డబ్బులు ఇచ్చి ఈ నెల అన్నదానం చెయ్యమని చెప్తుంటే.. వద్దని ఇందిరాదేవి ఆపుతుంది. ఎందుకు అత్తయ్య నేను చేసేది మంచి పనే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు చేసేది మంచి పని అయితే మాత్రం నాకు నచ్చనవసరం లేదా అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని ధాన్యలక్ష్మి అనగానే నీ కోడలు విషయంలో అలా ఎందుకు ఆలోచించడం లేదు.. తను చేసింది మంచి పనే కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.