English | Telugu

Brahmamudi : పెళ్ళిచూపుల గొప్పతనం చెప్పిన ఇందిరాదేవి.. రాహుల్ కోసం స్వప్న ఏడుపు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -884 లో.. సుభాష్, అపర్ణ పెళ్లిరోజు సందర్బంగా వాళ్ళకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని ఒకసారి నడవమనండి అని అబ్బాయి వాళ్ళు అంటారు. దాంతో అపర్ణ నడిచి చూపిస్తుంది. అసలు పెళ్లిచూపులు ఎందుకు ఏర్పాటు చేస్తారు అమ్మమ్మ అని ఇందిరాదేవిని కావ్య అడుగుతుంది. దాంతో ఇందిరాదేవి పెళ్లిచూపుల గొప్పతనం చెప్తుంది. అప్పుడే కోపంగా స్వప్న ఎంట్రీ ఇస్తుంది. చాలా బాగుంది అందరు సరదాగా సంతోషంగా ఉన్నారని స్వప్న అనగానే ఏంటి అలా అంటున్నావ్.. నువ్వు ఇక్కడ మిస్ అయ్యావని అలా అంటున్నావా అని కావ్య, అప్పు అంటారు.

Karthika Deepam2 : ఇంటి వారసురాలు దీప చేతుల మీదుగా హోమం.. అందరు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -521 లో.. కావేరిని జ్యోత్స్న అవమానిస్తుంది. అదంతా కార్తీక్ కి తెలిసి జ్యోత్స్నతో కావేరికి క్షమాపణ చెప్పిస్తాడు. కావేరి కాళ్ళకి పసుపు రాయమని జ్యోత్స్నకి సుమిత్ర చెప్పగానే.. జ్యోత్స్న చేసేదేమీ లేక కావేరి కాళ్ళకి పసుపు రాస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంతో ఉంటుంది. అందరికి రాయి అని సుమిత్ర అంటుంది. నేను రాస్తానని దీప అంటుంది. కాంచనకి సుమిత్రకి దీప పసుపు రాస్తుంది దీప. అదంతా కార్తీక్ చూస్తాడు. దీపని చూసి నవ్వుతాడు.