కూలీ ఓవర్ సీస్ బిజినెస్ ఇలా అయిపోతుందని ఎవరైనా ఊహించారా!
మూడున్నర దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతూ వస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఆగస్టు 14 న 'కూలీ'(Coolie)అనే హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో స్టార్ హీరో 'అక్కినేని నాగార్జున'(Akkineni Nagarjuna)విలన్ గా చేస్తుండటం, ఖైదీ, విక్రమ్, మాస్టర్,లియో చిత్రాల ఫేమ్' లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)దర్శకత్వం వహించడంతో 'కూలీ' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.