English | Telugu
విడాకులు తీసుకుంటున్న నయనతార.. అసలేం జరిగింది..?
Updated : Jul 4, 2025
కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆ తర్వాత మనస్పర్థలతో అనూహ్యంగా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నయనతార తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది. తన భర్తతో, పిల్లలతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాంటి నయనతార.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది.
"స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇప్పటికే మీ వల్ల చాలా ఫేస్ చేశాను." అంటూ నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దీంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
అసలు ఈ పోస్ట్ వెనుక ఆంతర్యమేంటి? నయనతార నిజంగానే విడాకులు తీసుకోబోతుందా? లేక ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయిందా? లేదా ఇంకేమైనా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. నయనతార, విఘ్నేష్ శివన్ లో ఎవరైనా స్పందిస్తే గానీ.. దీనిపై ఓ క్లారిటీ రాదు. కాగా, గతేడాది కూడా వీరి విడాకుల వార్తలు రావడం గమనార్హం.
