English | Telugu
దసరాకు విశ్వంభర.. మరి ఓజీ..?
Updated : Jul 4, 2025
మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పలు కొత్త రిలీజ్ డేట్ లు ప్రచారంలోకి వచ్చాయి కానీ, ఏదీ నిజం కాలేదు. ఇక ఇటీవల అసలు 'విశ్వంభర' సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమనే వార్తలు వినిపించాయి. దాంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే మెగా ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. 'విశ్వంభర' త్వరలోనే విడుదల కాబోతుందని, ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది.
అసలు 'విశ్వంభర' ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత వేసవి అన్నారు. ఆ తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ లో రాబోతుందని సమాచారం. సెప్టెంబర్ 18న 'విశ్వంభర'ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
తెలుగు సినిమాకి సంక్రాంతి, వేసవితో పాటు దసరా అనేది మంచి సీజన్. అక్టోబర్ 2న దసరా పండుగ. దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ.. సెప్టెంబర్ 25 తేదీపై ఇప్పటికే 'అఖండ-2', 'ఓజీ' సినిమాలు కర్చీఫ్ వేశాయి. దాంతో ఆ సినిమాల కంటే వారం ముందుగా సెప్టెంబర్ 18న 'విశ్వంభర'ను రిలీజ్ చేయాలని నిర్ణయించారట.
సెప్టెంబర్ 18న అన్నయ్య చిరంజీవి 'విశ్వంభర', సెప్టెంబర్ 25న తమ్ముడు పవన్ కళ్యాణ్ 'ఓజీ' విడుదలైతే.. మెగా అభిమానులకు అసలుసిసలైన పండుగ అని చెప్పవచ్చు.
