English | Telugu

ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ రివ్యూ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే21, 1991న ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వెళ్తారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ ఘటనలో ఆయనతో సహా పదహారు(16) మంది ప్రాణాలు కోల్పోతారు. తెల్లవారేసరికి రాజీవ్ంధీ మరణవార్త విని యావత్ భారత దేశం షాకవుతారు. దీంతో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తాడు. ఈ దాడి వెనుక ఎన్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ఉందని ఎలా గుర్తించారు? ప్రధాన సూత్రధారి శివరసన్ (షఫీక్ ముస్తఫా) పోలీసులు, సీబీఐ కంటపడకుండా ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో సిట్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని దాటుకుని శివరసనను పట్టుకున్నారా లేదా అన్నది సిరీస్.

షైన్ టామ్ చాకోని ఆరాధిస్తున్నానంటున్న విన్సీ.. క్షమాపణలు చెప్పిన షైన్ 

దసరా, దేవర పార్ట్ 1 ,డాకు మహారాజ్ వంటి హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom Chacko). మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన షైన్ 2002 లో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పటి వరకు సుమారు ఎనభైకి పైగా చిత్రాల్లో వివిధ క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని నెలల క్రితం షైన్ గురించి ప్రముఖ మలయాళ నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)మీడియా సమక్షంలో మాట్లాడుతు ఒక సినిమా షూటింగ్ సమయంలో షైన్ డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి గాయపరిచాడని చెప్పింది.