English | Telugu

పవన్ కళ్యాణ్ ఇద్దరు కొడుకులు ఒకే చోట.. పిక్స్ వైరల్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ నెల 24 న చారిత్రాత్మక మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara veeramallu)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల నుంచి వీరమల్లు షూటింగ్ ని జరుపుకోవడంతో పాటు, రిలీజ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. దీంతో వీరమల్లుపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పెద్దగా హైప్ లేకుండా పోయింది. కానీ ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా వీరమల్లు పై అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ అయితే పక్కా హిట్ అని అంటున్నారు. ట్రైలర్ కూడా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది.

ఈ రోజు ఉదయం పవన్ తన ఇద్దరు కుమారులు అకిరా నందన్(Akira Nandan)మార్క్ శంకర్(Mark Shankar)తో కలిసి మంగళగిరి(Mangalagiri)లో తన ఇంటికి వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అయితే తండ్రి తనయులు అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ని షేర్ చేస్తున్నారు. మార్క్ శంకర్ కొన్ని నెలల క్రితం సింగపూర్ లోని ఒక స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం తెలిసిన విషయమే.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.