English | Telugu
థియేటర్స్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామ!. ఆ సినిమా ట్రైలర్ కి ఏం సంబంధం లేదు
Updated : Jul 3, 2025
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'స్టూడెంట్ నెంబర్ 1 'నుంచి మొన్న వచ్చిన 'దేవర' వరకు ఆ క్రేజ్ సినిమా సినిమాకి పెరుగుతునే ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆయా చిత్రాలు సాధిస్తున్న కలెక్షన్స్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది దేవర(Devara)తో 500 కోట్ల రూపాయిల మార్క్ ని అందుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ దేవర తర్వాత బాలీవుడ్ లో తెరకెక్కిన 'వార్ 2'(War 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మూవీ అయినప్పటికీ, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ నుంచి తెలుగులో వస్తున్న సోలో మూవీగానే భావిస్తున్నారు. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఎన్టీఆర్ హీరోగా, హృతిక్ రోషన్ విలన్ గా చేస్తునట్టుగా అర్ధమవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమాగానే వార్ 2 రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పట్నుంచే ఏపి, తెలంగాణాలో స్పెషల్ షో ప్రదర్శించడం కోసం థియేటర్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
దీన్ని బట్టి ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వార్ 2 లో కియారా అద్వానీ(Kaira Adwani)హీరోయిన్ గా చేస్తుండగా హిందీ చిత్ర రంగంలో పేరు మోసిన నటులు పలు కీలక పాత్రల్లో చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో యష్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఆగస్ట్ 14న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కి రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.