English | Telugu

Podarillu: సూపర్ ట్విస్ట్.. మహా పెళ్ళికి ఏర్పాట్లు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -18 లో... భూషణ్ వెళ్లిపోతుంటే.. మహ అప్పుడే లోపలికి వెళ్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. ఏంటి అప్పుడే వదిలేశారా అని మహా అంటుంది. ఏంటి అసలు నన్ను కిడ్నాప్ చేశారన్న బాధ కన్పించడం లేదని భూషణ్ అనగానే.. మహా బాధగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ఈ పెళ్లి ఆగకూడదని నేనొక నిర్ణయం తీసుకున్నానని భూషణ్ చెప్పి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే ఇదే కరెక్ట్ టైమ్ వాడితో నా పెళ్లి ఆపించాలని మహా అనుకొని.. నాన్న వాడితో పెళ్లి ఇష్టం లేదు. అందుకే ఆగిపోయింది.. ఇకనైనా ఆపేయండి అని మహా అంటుంది. చాలు ఆపు అంటూ ప్రతాప్ తనపై సీరియస్ అవుతాడు. ఇలా ఆగకూడదు అనే నీ పెళ్లి మూడు రోజుల్లో చేస్తున్నానని ప్రతాప్ అనగానే మహా షాక్ అవుతుంది.

మరొకవైపు మాధవకి తను పెళ్లి చూపులకి వెళ్లిన అమ్మాయి ఫోన్ చేసి కలిసి మాట్లాడాలని అంటుంది. దానికి మాధవ సరే అంటాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి మహా వచ్చి నీ వల్ల పెళ్లి మూడు రోజుల్లో ఫిక్స్ అయిందని కోప్పడుతుంది.

మరుసటిరోజు మహా నిద్ర లేచేసరికి పెళ్లి పనులు జరుగుతుంటాయి. ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అదంతా చూసి మహా షాక్ అవుతుంది. ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఈ పెళ్లి ఎలా ఆపాలని చక్రి టెన్షన్ పడతాడు.

తరువాయి భాగంలో చక్రి తన అన్నయ్య మాధవకి ఫోన్ చేసి మహా గురించి చెప్తాడు. ఆ తర్వాత ఇంతక ముందు అబ్బాయి లేకపోతే పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు అమ్మాయి లేకపోతే పెళ్లి ఆగుతుంది కదా అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.