English | Telugu

Brahmamudi: రాజ్ కి దగ్గరవుతున్న రేఖ.. కావ్యకి పొంచి ఉన్న ప్రమాదం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -917 లో... నీ వల్లే నేను దేశాలు పట్టుకొని వెళ్ళాను.. రాజ్ బావకి నన్ను ఇచ్చి చేసి ఉంటే ఈ ఇంట్లోనే ఉండేదాన్ని కదా అని రుద్రాణిపై రేఖ అరుస్తుంది. రాజ్ కి నువ్వు ఇష్టం లేదు కదా అని రుద్రాణి అనగానే ఆ కావ్యని మాత్రం రాజ్ ఇష్టపడి చేసుకున్నాడా అని రేఖ అంటుంది.

ఆ తర్వాత రేఖ డ్రింక్ చేస్తుంటే రాహుల్ తనపై కోప్పడతాడు. అప్పడే రాజ్ వస్తాడు. చూడు రాజ్ బ్రేకప్ అయిందని ఎలా చేస్తుందోనని రాహుల్ అనగానే.. నేను మాట్లాడుతాను నువ్వు వెళ్ళు అని రాహుల్ ని పంపిస్తాడు రాజ్. జరిగింది జరిగిపోయింది మాములుగా ఉండమని రాజ్ సలహా ఇస్తాడు.

మరుసటిరోజు కావ్యని రాజ్ వాకింగ్ చేయిస్తుంటే.. రేఖ చూసి ఓర్వలేకపోతుంది. ఆ తర్వాత కావ్య కోసం రాజ్ జ్యూస్ చేసుకొని తీసుకొని వెళ్తుంటే.. రేఖ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటుంటుంది. అది రాజ్ చూసి వచ్చి తను ట్యాబ్లెట్ వేసుకోకుండా అపుతాడు. ఏం జరిగిందని రాజ్ అడుగగా..డిప్రెషన్ లో ఉన్నానని రేఖ అంటుంది. మేమందరం ఉన్నాం కదా.. మనుషులతో మాట్లాడమని రేఖతో రాజ్ చెప్తాడు. ఇక రాజ్ చేతిలోని జ్యూస్ చూసిన రేఖ.. బావ ఈ జ్యూస్ నా కోసమేనా అంటూ రాజ్ చేతిలోని జ్యూస్ ని తీసుకొని తాగుతుంది. అదంతా కావ్య చూసి రాజ్ రాగానే ఏంటి జ్యూస్ తనకి ఇచ్చావని అడుగుతుంది.

మరొకవైపు కావ్యకీ టిఫిన్, ట్యాబ్లెట్ ఇవ్వలేదని ఇందిరాదేవి, పనిమనిషి దగ్గరికి వెళ్తుంది. రేఖ అమ్మ ఏదో పాస్తా చేయమంది అని పనిమనిషి చెప్తుంది. అప్పుడే రేఖ వస్తుంది. నీకు నచ్చింది నువ్వు తిను కానీ పనిమనిషిని ఇబ్బంది పెట్టకు.. ముందు కావ్యకి ఫుడ్ పెట్టాలని ఇందిరాదేవి అంటుంది. దాంతో రేఖ కోపంగా బయటకు వెళ్తుంది.

రేఖ దగ్గరికి రాజ్ వెళ్లి నీకు కావాల్సింది పాస్తా కదా అని ఆర్డర్ చేసి ఇస్తాడు. దాంతో నువ్వు ఒక్కడివే బావ నన్ను అర్థం చేసుకుందని రాజ్ ని రేఖ హగ్ చేసుకుంటుంది. రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య ఉంటుంది. ఇక కావ్య కోపంగా లోపలికి వెళ్లి ఇందిరాదేవితో మాట్లాడతుంది.

తరువాయి భాగంలో కావ్య కడుపులోని బిడ్డని లేకుండా చెయ్యడానికి రేఖ, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.