English | Telugu

శంకర్ దాదా మూవీ డైలాగ్స్ తో అలరించిన అనిల్ రావిపూడి

సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల పాటలతో పాటు అనిల్ రావిపూడి, అనంత్ శ్రీరామ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ఫుల్ ఛిల్ల్ అవుతున్నారు. ఈ వారం వాళ్ళు శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో చిరంజీవి వాకింగ్ మూవ్మెంట్ ని స్పూఫ్ గా చేశారు. ఫన్నీ డైలాగ్స్ లో అలరించారు.

"లింగం అంకుల్ స్వీట్ పొటాటోలో స్వీట్ ఉంటుంది కానీ బాటిల్ గార్డ్ లో బాటిల్ ఉండదు అని అర్ధం " అంటూ అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ కి అనంత శ్రీరామ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ ఐపోయాడు. నెత్తి మీద హాట్ ప్యాక్ పెట్టుకుని పిచ్చిపిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. సుధీర్ ఆయన నవ్వును చూసి "ఏమైందన్న" అని అడిగాడు. "దాన్ని లాఫింగ్ సైకో ఫోబియా" అంటారు అని చెప్పాడు అనిల్ రావిపూడి. "పానీపూరి లో పానీ ఉంటుంది కానీ బటర్ ఫ్లైలో బటర్ ఉండదు" అంటూ ఇంకో డైలాగ్ వేసాడు. ఈ డైలాగ్స్ ని అనంత శ్రీరామ్ ఒక రకంగా డాన్స్ చేసేసరికి "ఏమన్నా పట్టుకుందా ఏమిటి గట్లా తిరుగుతుండు" అని సుధీర్ అడిగాడు. దానికి అనిల్ రావిపూడి "దాన్ని డ్యాన్సో స్కెరో ఫోబియా" అంటూ చెప్పేసరికి ఆడియన్స్ అంతా నవ్వేశారు. "అంటే ఏంటన్నా" అని సుధీర్ అడిగేసరికి "నాకు తెలిసినవే రెండు ముక్కలు నన్ను మళ్ళీ మళ్ళీ అడక్కురా" అన్నాడు అనిల్ రావిపూడి.

ఇక ఈ షోకి "సహకుటుంబానాం" మూవీ టీమ్, అలాగే "నయనం" టీమ్ వచ్చారు. హీరో వరుణ్ సందేశ్ పాటలు పాడి జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.