English | Telugu

‘కల్కి2’ కోసం ప్రభాస్ రెడీ.. షూటింగ్ ఎప్పటి నుంచంటే? 

ఎంతో కాలంగా ప్రభాస్ కొత్త సినిమా కోసం వెయిట్ చేసిన ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ‘రాజా సాబ్‌’ డిజప్పాయింట్ చేశాడు. ఇక నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి, వాటి అప్‌డేట్స్, ఎప్ప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయాలపైన దృష్టి పెట్టారు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రభాస్‌కి ఈ రెండు డిఫరెంట్ సినిమాలని చెప్పొచ్చు. ఈ సినిమాలపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. నిన్న మొన్నటి వరకు షూటింగ్ ఎప్ప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేని కల్కి2 ఇప్ప్పుడు ఆ రెండు సినిమాల పక్కన చేరింది. ఈ సీక్వెల్‌కి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. అయితే మార్చి తర్వాత ప్రభాస్ సెట్స్‌కి వస్తారని తెలుస్తోంది.

కల్కి చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని మించే స్థాయిలో సీక్వెల్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇండియాలోని టాప్ స్టార్స్‌తో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ను ప్రభాస్ ఇమేజ్‌ మరింత పెంచే స్థాయిలో నిర్మించనున్నారు. ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు చేస్తూనే కల్కి2కి కూడా డేట్స్ కేటాయించారు ప్రభాస్.