English | Telugu

Karthika Deepam2: బిడ్డ కోసం శివన్నారాయణ ఆత్రుత.. నిలదీసిన కాశీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -398 లో.... కాంచన కింద పడిపోయినందని తెలిసి తన దగ్గరికి వస్తాడు శ్రీధర్. నేను తప్పు చేశాను నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు. అందరం కలిసి ఉందామని అడుగుతాడు శ్రీధర్. నిన్ను కావేరికి దానం చేశాను.. మళ్ళీ ఎలా తిరిగి తీసుకోవాలి.. అది జరగని పని అని కాంచన అనగానే శ్రీధర్ బాధపడతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా మాట్లాడినందుకు కాంచన కూడా శ్రీధర్ వెళ్లిపోయాక బాధపడుతుంది.

ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వస్తారు. ఎందుకు లేట్ అయింది. అయిన ఒకరు ఇంట్లో ఉండొచ్చు కదా ఇంట్లో బాలేని మనిషి ఉన్నారు కదా అని శివన్నారాయణ అనగానే.. మా అమ్మ ఇప్పుడు బానే ఉంది కావాలంటే ఫోటో చూడండి అని కాంచన ఫోటోని కార్తీక్ చూపిస్తుంటే శివన్నారాయణ ఆత్రుతగా చూస్తాడు. కార్తీక్ ఫోటోని అలా చూపించి ఇలా తీసుకుంటాడు. ఏంటి నేను చూడలేదని శివన్నారాయణ అనగానే అవసరం ఉన్నవాళ్లు.. చూడాలనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్లి చూస్తారని కార్తీక్ అంటాడు. మరొకవైపు కావేరి దగ్గరికి శ్రీధర్ వస్తాడు. కాంచన కిందపడిన విషయం గురించి శ్రీధర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు.

ఇదంతా ఆ జ్యోత్స్న వల్లే అని శ్రీధర్ అంటాడు. దీప అక్క ఏం చేసిందని కాశీ అంటాడు. వాళ్ళిద్దరి గొడవ‌ వల్లే నా భార్య ఇబ్బంది పడుతుందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి కాశీ వెళ్లి జ్యోత్స్న చేసిన తప్పు గురించి నిలదీస్తాడు. నువ్వేంటి రా బయటకు వెళ్ళు అని శివన్నారాయణ అంటాడు. మమ్మీ చూసావా.. నేను దీపకి సారీ చెప్పాను కానీ తనకు తృప్తి కాలేదు.. అందుకే కాశీనీ రప్పించిందని జ్యోత్స్న అంటుంది. నన్నెవరు రప్పించలేదని కాశీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.