English | Telugu

Brahmamudi: సిద్దార్థ్, కావ్యల మధ్య వార్.. అది యామిని స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-761 లో.. కావ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటారు. నిజంగానే నీకు అంత కోరిక ఉందంటే రాజ్ రాగానే వాడు ఐ లవ్యూ చెప్పగానే నువ్వు కూడా ఐ లవ్యూ టూ అని చెప్పెయ్.. అప్పుడు నమ్ముతామని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. అలాగే చెబుతాను నాకేమైనా భయమా అమ్మమ్మగారు అని కావ్య అంటుంది. నీకేం భయం లేదు చెల్లి.. నువ్వు ఎక్కడ చివరి నిమిషంలో జారుకుంటావో అన్నదే మా అందరి భయం అని స్వప్న అంటుంది. ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది. అదిగో నా మనవడు వచ్చాడు.. రెడీగా ఉండు కావ్యా అని ఇందిరాదేవి అంటుంది. అంతా చూస్తున్న రుద్రాణీ మనసులో.. ఇది అయ్యే పని కాదులే.. యామినీ ఏదో స్కెచ్ వేసే ఉంటుందని అనుకుంటుంది. ఇక రాజ్ వచ్చి కావ్యకు హాయ్ చెప్పడం.. నిన్న వెళ్లిపోవడం గురించి కావ్య.. రాజ్‌కి సారీ చెప్పడం పూర్తి అయిన తర్వాత.. కళావతి గారు మనం బయటికి వెళ్దామా అని రాజ్ అంటాడు. రేయ్ బయటికి వెళ్లే పనులేం వద్దు.. ఇక్కడే ఇక్కడే ఆ మూడు ముక్కలు(ఐ లవ్ యూ) చెప్పెయ్.. మీరు బయటికి వెళ్తుంటే విషయం చెప్పడానికి వీలు కావట్లేదు కదా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో సరే అని రాజ్ స్టార్ట్ చేస్తాడు.

ఇంతలో అపర్ణా దేవికి .. కంపెనీ మేనేజర్ కమల్ కాల్ చేస్తాడు. మధ్యలో ఈ ఫోన్ ఏంట్రా అని కట్ చేస్తుంది. జీవితంలో సంతోషం అనే పదానికి అర్థం అంటూ రాజ్ కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఆ మేనేజర్ సుభాష్‌కి కాల్ చేస్తాడు. సుభాష్ లిఫ్ట్ చేసి.. మళ్లీ చేస్తాను కమల్ అంటాడు. అయితే అవతల నుంచి మేనేజర్.. సర్, సర్.. ఈ రోజు బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు సర్ ఆ సిద్ధార్థ్ గారు. కావ్య మేడమ్ ఫోన్ కలవడం లేదని మేనేజర్ కంగారుగా అంటాడు. వాట్ అంటూ సుభాష్ నిల్చొని.. అమ్మా కావ్యా... మీటింగ్ ఏదైనా ఉందా అని అంటాడు. లేవు మావయ్యా ఏ మీటింగ్ లేవు కదా అని కావ్య అంటుంది. మరి కమల్ ఏంటి ఇలా అంటున్నాడు. ఒకసారి నువ్వే మాట్లాడమ్మా అని సుభాష్ అంటాడు. దాంతో ఫోన్ అందుకుంటుంది కావ్య. మేడమ్ ఆ సిద్ధార్థ్ గారు ఉన్నట్టుండి బోర్డ్ మీటింగ్ అంటున్నారు.. చూడబోతే ఏదో ప్లాన్ చేసినట్లే ఉన్నాడు. మీరు త్వరగా రండి మేడమ్ అని మేనేజర్ అంటాడు. వెంటనే వస్తానని కావ్య ఫోన్ పెట్టేయగానే.. రాజ్ వైపు అయోమయంగా చూస్తుంది. అయ్యో కావ్య గారు మీరు వెళ్లండి.. ఎంత అవసరం లేకపోతే ఫోన్స్ వస్తాయంటూ రాజ్ సపోర్ట్‌గా మాట్లాడతాడు. దాంతో కావ్య ఆఫీస్‌కి వెళ్లిపోతుంది.

ఇక కావ్య మీటింగ్‌కి వెళ్తుంది. కూర్చుంటుంది. సిద్ధార్ధ్ అక్కడ వన్ మ్యాన్ షో చేస్తాడు. నేను ఈ కంపెనీకి 5 వందల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఇతర దేశాల్లో కొన్ని విగ్రహాలను డిజైన్ చేసే పని. అయితే క్లయింట్స్‌ నన్ను చూసి వచ్చారు కాబట్టి కంపెనీ ఎండీగా నన్నే కోరుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే నాకు కావ్య గారి నాయకత్వంపై నమ్మకం లేదు. అందుకే రెండు రోజులు టైమ్ ఇస్తున్నాను.. ఆవిడ నాకంటే గ్రేట్ అని నిరూపించుకుంటే ఓకే. లేదంటే ఆవిడ పదవి నుంచి తప్పుకోవాలని సిద్దార్థ్ అంటాడు. మిగిలిన బోర్డ్ మెంబర్స్ అంతా మొదట కావ్యకు సపోర్ట్‌గా మాట్లాడతారు. ఎండీ పదవి మీకెందుకు ఇస్తారు సిద్ధార్థ్ గారు.. కావ్య గారి ఫ్యామిలీ కదా దీన్ని స్థాపించిందని అంటారు. మనకు లాభాలు ముఖ్యం కానీ ఇదంతా కాదు కదా.. పైగా మనం కూడా పార్టనర్స్ కదా అని సిద్దార్థ్ అంటాడు. దాంతో ఆ బోర్డ్ మెంబర్స్ అంతా మాట మారుస్తారు. సరే రెండు రోజుల్లో కావ్య గారు గ్రేట్ అని నిరూపించుకుంటే ఓకే లేదంటే పదవి మీకు అప్పగిస్తారని చెప్పేస్తారు. దాంతో కావ్య ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది అంతే ప్రతిసారీ. ఏం మాట్లాడదు. అప్పుడే కావ్యకి యామినీ కాల్ చేస్తుంది. బోర్ట్ మీటింగ్ అయిపోయిందా అంటూనే సిద్ధార్థ్ ఎంట్రీకి తనే కారణం అనే విషయం చెప్తుంది. సిద్దార్థ్ కారణంగా కంపెనీలో నీ స్థానం పోతుంది. తర్వాత అత్తింట్లో నీ గౌరవం, స్థానం రెండూ పోతాయి. ఎలా ఉంది నా దెబ్బ అంటూ యామినీ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.