ఢీ సీజన్ 20 త్వరలో
బుల్లితెర మీద ఫేమస్ ఢీ డాన్స్ షో సీజన్ 20 త్వరలో మొదలుకాబోతోంది. ఐతే ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ కొత్త సీజన్ కి కూడా యాంకర్ గా నందు వచ్చాడు. ఐతే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్ రాగా లేడీ జడ్జ్ గా రెజీనా కసాండ్ర రాబోతోంది. తాజాగా ఈ ఢీ న్యూ సీజన్ గ్రాండ్ లాంచో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఢీ హిస్టరీలో కొన్ని మైల్ స్టోన్స్ ఉండబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సుస్మిత ఆనాల, జతిన్, రాజు, పండు మాష్టర్, భూమిక, అన్షు రెడ్డి ఉండబోతున్నారు. అలాగే శ్రీవాణి కూతురు రాజనందిని కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. విక్రమాదిత్య వచ్చి కూతురి కాళ్లకు నల్ల తాడు కట్టాడు. జాను లిరి వాళ్ళ అబ్బాయి కూడా స్టేజి మీదకు వచ్చాడు.