English | Telugu

Karthika Deepam2: శ్రీధర్ లో మార్పు.. కాంచన కాళ్ళపై పడి మరీ ఏడ్చాడుగా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-397 లో.. మనసుకి తగిలిన గాయాలకు మాటలు సరిపోతాయేమో కానీ ఒంటికి తగిలిన గాయాలకు మాత్రలు కావాలి. నేను నీకు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఇది నీకు అవసరం వేసుకోమంటూ కాంచనకి శ్రీధర్ ఇస్తాడు. దాంతో కాంచన టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది. మనసుకి గాయాలను ఎప్పటికీ మందులుండవుగా అని కాంచన అంటుంది. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోవచ్చు కానీ నీ మీద నేను చూపించే ప్రేమ అయితే నిజం కాంచనా అని ఎమోషనల్ గా శ్రీధర్ చెప్తాడు. ఇంతలో అనసూయ వచ్చి మీరెందుకు వచ్చారని శ్రీధర్ ని అడుగుతుంది. నా భార్య కోసం వచ్చానని శ్రీధర్ అంటాడు. అయితే మీరు రాంగ్ అడ్రస్‌కి వచ్చారు మాస్టారు అంటూ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ వెనుకే దీప కూడా ఉంటుంది.

మీరు చేసిన తప్పే మీ భార్య చేసి ఉంటే మీరేం చేసేవారని అనసూయ అనగానే.. అవును నేను చేసింది తప్పే.. కానీ నాకు నా భార్య అంటే ప్రేమ ఉంది అని శ్రీధర్ అంటాడు. భార్య మీద ప్రేమ ఉన్నవాడు మరో ఆడదానివైపు కన్నెత్తి చూడడు. కన్నెత్తి చూడటం కాదు ఏకంగా కాపురం చేసి కూతుర్నే కన్నావ్.. నిన్ను వద్దు అనుకునే కదా మా అమ్మ పొమ్మంది.. మళ్లీ ఈ రాకలెందుకు.. ఈ దొంగ ప్రేమలెందుకని కార్తీక్ కోపంగా అంటాడు. ఆ మాటతో శ్రీధర్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అవునురా నాది దొంగ ప్రేమే అంటూ శ్రీధర్ ఎమోషనల్ గా.. కాంచనా నువ్వు చెప్పు కాంచనా.. నాది దొంగ ప్రేమే కదా.. కార్తీక్ పుట్టిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యింది. జీవితంలో ఇక నువ్వు లేచి నడవలేవు అన్నారు.. ఏ రోజు అయినా నిన్ను తక్కువ చూశానా.. నీకు నా ప్రేమను పంచలేదా.. నిన్ను ఏరోజైనా అవమానంగా మాట్లాడానా అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండీ ఆవిడ్ని బాధపెట్టడానికి కాకపోతే అని దీప అంటుంది. లేదు దీపా.. నేనేంటో నా కొడుక్కి తెలియకపోయినా నా భార్యకు తెలుసు కదా అని శ్రీధర్ ఏడుస్తూ అంటాడు. తెలుసండి.. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో నాకు తెలుసు.. మీరు నాకోసం వంట చేసేవారు. నాకు జడ వేసేవారు.. నా కాళ్లకు ఆయిల్ రాసేవారు. నాకు భోజనం తినిపించే వారు. భర్త భార్యను చూసుకున్నట్లు కాకుండా ఒక తండ్రి కూతుర్ని చూసుకున్నట్లు చూసుకున్నారు. కానీ బాధేంటంటే మీరు నాలాగే మరో ఆడదాన్ని కూడా చూసుకున్నారు.. ఆ నిజం నాకు తెలిసిన రోజున నా నరాలను ఎవరో కత్తితో నరుకుతున్నట్లు అనిపించింది. నాకే కాదండీ ప్రతి ఆడది ఇలానే బాధపడుతుంది. నిజం తెలియగానే బోరుబోరున ఏడ్చానండీ.. నా ఏడుపునే నాకొక దారిని చూపించింది. నా జీవితంలో నాతో పాటు నా కొడుకు ఉంటే చాలు అనిపించింది. నేను అవిటిదాన్నే కానీ ఎప్పుడూ నా అవిటి నాకు గుర్తే రాలేదు. మిమ్మల్ని నా జీవితంలోంచి పంపించిన తర్వాత నే...నేను మొదటి సారీ అవిటి దాన్ని అయ్యానంటూ కాంచన ఏడుస్తుంది.

కాంచన అలా అనగానే శ్రీధర్ కుమిలిపోతూ అక్కడే నేల మీద కాంచన కాళ్ల దగ్గర కూలబడిపోతాడు. నేను తప్పు చేశాను కాంచనా.. అది నా బలహీనత.. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను.. కానీ నీ మీద ప్రేమను నేను ఏ నాడు నటించలేదు. నువ్వు నన్ను పొమ్మన్నావ్.. పోయానంటూ శ్రీధర్ మాట్లాడతాడు. కాంచనా.. మన కొడుక్కి పెళ్లి అయిపోయింది. వాడికో కూతురు ఉంది. వాడి జీవితం వాడు చూసుకుంటాడు. ఈ వయసులో మనకు కావాల్సింది కాస్త ప్రశాంతత.. రా కాంచనా నువ్వు, నేను, కావేరీ మన ముగ్గురం కలిసే ఉందాం, లేదంటే చెప్పు.. కావేరీని తీసుకుని నేనే ఇక్కడికి వచ్చేస్తానంటాడు. హలో మాస్టారూ అంటూ కార్తీక్ తిట్టబోతుంటే దీప అడ్డుపడుతుంది. బావా .. మీ నాన్నగారు నీతో మాట్లాడటం లేదు. తన భార్యతో మాట్లాడుతున్నారు.. నాకోసం నువ్వు మౌనంగా ఉండు బావా అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.