English | Telugu

మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ వలన చాలా డిస్టర్బ్ అయ్యాను..

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ అనగానే ఆర్కె. నాయుడు అలియాస్ సాగర్ గుర్తు రాకుండా ఉండరు. రీసెంట్ గా అతను "ది 100 " అనే మూవీలో నటించాడు. నటుడిగా కాకుంటే పోలీస్ అవ్వాలనే కల ఉండేదని సుమ చాట్ షోలో చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి కానీ దాని వెనక స్టోరీ కూడా చెప్పారు. "మొగలి రేకులు పీక్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో శివాజీ అనే క్యారెక్టర్ గురించి చెప్పారు. ప్రభాస్ గారికి సెకండ్ లీడ్ గా అని చెప్పారు. ఐతే అప్పటికి నాకు మూవీస్ కి వెళ్లాలన్నా ఆలోచన లేదు. సీరియల్స్ లో చక్కగా నడుస్తోంది కదా అనుకున్నా. మంజుల నాయుడు గారికి ఇలా ఒక అవకాశం వచ్చింది అని అడిగాను.

బిందు నాయుడు గారిని అడగమన్నారు. ఐతే ఆవిడ మూవీ కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తాను. కానీ 15 డేస్ కాబట్టి చాలా కష్టం కానీ ఓకే అని చెప్పారు. ఇక అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నేను అనుకున్న క్యారెక్టరైజెషన్ కనిపించలేదు. చాలా నిరుత్సాహపడ్డాను. ఇది కాదు కదా నేను అనుకున్నది అనిపించింది. అలా కొన్ని రోజులు షూటింగ్ డేట్స్ ఇచ్చాను. ఫస్ట్ మూడు రోజులు షూటింగ్ జరగలేదు. ఏవో కొన్ని సీన్స్ చేసారు. కానీ అది కాదు కదా క్యారెక్టర్ అంటే అనిపించి డైరెక్టర్ ని అడిగాను. అర్ధం చేసుకోండి. అప్పుడప్పుడు రోల్స్ మారతాయి అన్నారు. కానీ నాకు నచ్చలేదు వచ్చేసాను. కానీ ఆ సీన్ ని మూవీలో ఉంచేశారు. ఐతే ఆ మూవీలో సీన్ చూసాక అందరూ అలాంటి క్యారెక్టర్ చేశావేంటి అని అడిగారు. అలాగే టి.సుబ్బిరామి రెడ్డి గారు కూడా ఫోన్ చేసి అలాంటి రోల్ చేశావేంటి అని అడిగారు. దాంతో నేను చాల డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత రంగస్థలం మూవీ టైంలో కూడా సుకుమార్ గారు అడిగారు. ఐతే మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ మొత్తం చెప్పాను. కానీ అలా జరగదు అన్నారు. ఐతే తర్వాత ఆది గారిని కలిసారని తెలిసింది. ఆది గారు కూడా మొదట్లో ఒప్పోకోలేదు. నేను మనసు మార్చుకొని చేద్దాం అనుకున్నాను. కానీ, సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఆది గారు ఓకే చెప్పేశారు." అని చెప్పుకొచ్చారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.