English | Telugu

చిరుతో-రజనితో రెండు సినిమాలు మిస్ చేసుకున్నా

సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసింది. కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు మూవీలో నటించింది. అలాంటి కస్తూరి రీసెంట్ గా ఒక చిట్ చాట్ షోలో చాల ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "నేను ఇద్దరు స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మిస్ అయ్యాను. జెంటిల్ మ్యాన్ మూవీ హిందీ వెర్షన్ లో చిరంజీవి గారితో హీరా నటించింది. ఆమె రోల్ లో నేను నటించాల్సింది కానీ ఆ టైంలో నాకు టైఫాయిడ్ ఫీవర్ రావడం వలన అవకాశం మిస్ చేసుకున్నాను. ఇంకో స్టార్ రజనీకాంత్ గారితో మూడు సార్లు రకరకాల కారణాలతో అవకాశాలు మిస్ చేసుకున్నాను.

కబాలి మూవీలో ఒక రోల్ కి నేను చాలా యంగ్ లుకింగ్ అని చెప్పి ఆ రోల్ ఇవ్వలేదు. ఈ రెండు అవకాశాలను మిస్ చేసుకోవడం నేను చాల రిగ్రెట్ గా ఫీలవుతాను. "నా పెట్ నేమ్ పండు. నేను స్కూల్ లో నేర్చుకున్నదాని కంటే సినిమాల్లో నేర్చుకున్నది చాలా ఎక్కువ. ఇక బెస్ట్ అండ్ వరస్ట్ పార్టీ నా కోపం. మంచి విషయానికి కోప్పడితే మంచిదే కానీ ముక్కు మీదే కోపం ఉంటుంది నాకు అది నష్టం నాకే. తెలుగు మహిళలు నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం గొప్ప విషయం. పాలిటిక్స్ వైపు వెళ్ళడానికి నా కోపం కారణం. నేను అమెరికాలో 15 ఇయర్స్ ఉన్నాను. అక్కడ కూడా పేదరికం, రోగాలు, లోటుపాట్లు ఉన్నాయి. కానీ స్ట్రగుల్ చేసే కల్చర్ లేదు. కానీ ఇండియాలో చాలా తేడాలు ఉన్నాయి. ఎం జరిగినా మా రాత ఇంతే అని అలవాటు చేసుకుని సర్దుకుపోతున్నాం. అందుకే మనం ఫైట్ చేయాలి అని తెలుసుకున్న. ఈ ఫైటింగ్ లోనే నా జీవితం అంతా పోతే పోనీ. నా వాయసు కూడా ఐపోయింది. ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు అనుకుని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాను. నా కూతురు నా ప్రాణం. ఆమెతో మాట్లాడుతూ ఉండడం చాలా ఇష్టం" అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.