English | Telugu

సల్మాన్ కు నచ్చేసిన చరణ్ ఫ్రీడం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం "మెంటల్" కోసం హైదరాబాద్ లో హాల్ చల్ చేస్తున్నాడు. అయితే చరణ్ తో తనకున్న స్నేహంతో ఇటీవలే చరణ్ నటిస్తున్న "ఎవడు" చిత్ర షూటింగ్ స్పాట్ కి వెళ్లి కాసేపు ఆ యూనిట్ తో గడిపాడు. ఇదిలా ఉంటే ఆ టైం లో చరణ్ తో "ఫ్రీడం" సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. చరణ్ డాన్సులు చూసిన సల్మాన్ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడట. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అల్ ది బెస్ట్ చెబుతూ.. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ను ప్రత్యేకంగా అభినందిచడంతో పాటుగా.. తన సినిమాకు అవకాశం ఇస్తానని కూడా జానీకి మాట కూడా ఇచ్చాడంట. మరి త్వరలో జానీ మాస్టర్ బాలీవుడ్ లో కాలు కదపనున్నాడన్నమాట!