English | Telugu
భయపెడుతూ మత్తెక్కించనున్న "పంచమి"
Updated : Jul 12, 2013
సినిమా మొత్తం ఒకే విధంగా ఉంటే బోర్ కొడుతుంది. కాని సినిమా మొత్తం ఒకే పాత్రతో నడిస్తే.. ఆ పాత్రలో కూడా అందాలు ఆరబోసే అమ్మడు ఉంటే... ఒక్కసారి ఊహించుకోండి. ఇది నిజం.
అర్చన నటిస్తున్న తాజా చిత్రం "పంచమి". హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్చన మాత్రమే నటిస్తుంది. అయితే ఈ సినిమా హర్రర్ తో పాటుగా మాంచి మసాలా సినిమాగా కూడా రూపొందుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ట్రైలర్స్ యూత్ అందరిని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఈ అమ్మడు ఎంత హాట్ హాట్ గా నటించిందో నని జనాల్లో ఒకటే ఉత్కంట పెరిగింది.
అసలే సినిమా చాన్సులు కరువవుతున్న సమయంలో ఇలా సినిమా మొత్తం తనాక్కోతే సింగల్ పర్ఫార్మెన్స్ చిత్రం దొరకడంతో... అర్చన తన నటనతో పాటుగా తన అందాలను కూడా ప్రదర్శించేస్తుంది. మరి "పంచమి" అనే టైటిల్ ఊరికే పెట్టారా ఏంటి?