English | Telugu
"ఎవడు"కు వచ్చేది ఎవరు ?
Updated : Jul 1, 2013
"ఎవడు"కు వచ్చేది ఎవరు ?
ఈరోజు సాయంత్రం "ఎవడు" ఆడియో వేడుక జరగబోతోంది. ఈ ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి ఆ మధ్య వైజాగ్‌లో జరిగిన బీచ్ ఫెస్టివల్‌కు హాజరుకావడం విమర్శలపాలయ్యింది. కేధార్‌నాధ్ కల్లోలం గురించి ఖాతరు లేకుండా.. బీచ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సిగ్గు లేదా? అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అందువల్ల.. ఈరోజు సాయంత్రం జరిగే ఆడియో ఫంక్షన్‌కు ఆయన హాజరవుతారో.. లేదో తెలియకుండా ఉంది. మరోవైపు పవన్‌కళ్యాణ్ "అత్తారింటికి దారేది" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టులో విడుదలకానున్న నేపధ్యంలో ప్రతి నిమిషం విలువైనదే. అటు మెగాస్టార్ రాకుండా.. ఇటు పవర్‌స్టార్ రాకుండా.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమా ఆడియో వేడుక జరగడం అన్నది ఇప్పటివరకూ జరగలేదు. మరి "ఎవడు" విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే.. రామ్‌చరణ్ సినిమా ఫంక్షన్స్ అన్నిటికీ విధిగా హాజరయ్యే అల్లు అర్జున్ మాత్రం కచ్చితంగా అటెండ్ అవుతాడు. ఎందుకంటె "ఎవడు" ఆయన అతిధిపాత్ర కూడా చేసారు!