English | Telugu

"ఎవడు" ఆడియోకు అడ్డంకులు !!

రామ్‌చరణ్ నటిస్తున్న "ఎవడు" ఆడియోను తొలుత ఈనెల 30. ఆదివారం విడుదల చేయాలని భావించారు. అయితే.. అందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సోమవారానికి వాయిదా వేసారు. సోమవారం కార్యక్రమానికి కూడా పోలీసులు పలు ఆంక్షలు విధించారని తెలుస్తోంది. ఆడియో వేడుక జరగనున్న శిల్పకళావేదిక సామర్ధ్యానికి మించి పాస్‌లు జారీ చేయరాదని.. నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించరాదని, వాహనాలన్నీ లోపలే పార్కింగ్ చేయాలని పలు షరతులు విధించి ఆడియో నిర్వహణకు అనుమతించారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్లు బల ప్రదర్శనలకు వేదికలుగా మారుతున్నాయి. వెన్యూ కెపాసిటీతో సంబంధం లేకుండా పాసులు జారి చేసి అభిమానుల్ని తరలిస్తున్నారు. ఈ కారణం చేతే.. "బాద్‌షా" ఆడియో వేడుకలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోయాడు. ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని.. "ఎవడు" ఆడియో వేడుక నిర్వహణపై పలు ఆంక్షలు విధించారు. కాగా.. ఈ చిత్రాన్ని జూలై 11 లేదా 18 తేదీలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!