English | Telugu

నిన్న త్రివిక్ర‌మ్.. నేడు సుకుమార్..!

నిన్న త్రివిక్ర‌మ్.. నేడు సుకుమార్..!

సుకుమార్, వీవీ వినాయ‌క్, పూరీ జ‌గ‌న్నాథ్, గుణ‌శేఖ‌ర్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.. ఇలా కొంత‌మంది అగ్ర ద‌ర్శ‌కుల‌తో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా  రిపీట్ మోడ్ లో సినిమాలు చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే వీరిలో మ‌ళ్ళీ మ‌ళ్ళీ విజ‌యాలు అందించిన ఘ‌న‌త మాత్రం సుకుమార్, త్రివిక్ర‌మ్ కే ద‌క్కింది. అంతేకాదు.. ఇద్ద‌రితోనూ మూడేసి సార్లు జ‌ట్టుకట్టారు బ‌న్నీ. విశేష‌మేమిటంటే.. మూడోసారి ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో బ‌న్నీ ప‌నిచేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ గా రిలీజ్ అవ‌డం.

గ‌త ఏడాది ఆరంభంలో `అల వైకుంఠ‌పుర‌ములో` కోసం త్రివిక్ర‌మ్ కాంబోలో మూడో సినిమా చేసిన అల్లు అర్జున్.. ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో `పుష్ప - ద రైజ్` అంటూ సుకుమార్ కాంబినేష‌న్ లో మూడో చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నారు. మ‌రి.. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`, `అల వైకుంఠ‌పుర‌ములో` అంటూ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ చూసిన బ‌న్నీ.. `ఆర్య‌`, `ఆర్య 2` త‌రువాత సుకుమార్ కాంబినేష‌న్ లోనూ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

కాగా, ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో తెర‌కెక్కిన `పుష్ప - రైజ్` డిసెంబ‌ర్ 17న థియేట‌ర్స్ లోకి రానుంది. ఇందులో మూడు కోణాలున్న పాత్ర‌లో బ‌న్నీ సంద‌డి చేయ‌నున్నారు.