English | Telugu

ఈ నెల 12 న థియేటర్స్ లోకి ఎనిమిది చిత్రాలు.. పండుగ వచ్చినట్టేనా!


-మూవీ లవర్స్ లో పండుగ జోష్
-భిన్నమైన జోనర్స్ తో తెరకెక్కాయి
-ఏంటి ఆ చిత్రాలు

క్యాలెండర్ లో ఎన్ని పండగలు ఉన్నా అభిమానులకి మూవీ లవర్స్ కి సినీ పండుగ ఇచ్చే కిక్ వేరు. పైగా ఒకే రోజు రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయితేనే పండగ వచ్చినట్టుగా వాళ్లంతా భావిస్తారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎనిమిది సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే పండగ జాతర ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

'కార్తీ'(Karthi)కి తెలుగు నాట ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని మరోసారి తన నటనతో మెస్మరైజ్ చెయ్యడానికి 'అన్నగారు వస్తారు'(Annagaru Vastharu)అనే చిత్రంతో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 12 న కార్తీ కెరీర్ లోనే హయ్యస్ట్ థియేటర్స్ లో విడుదల కానుంది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కడం ఈ చిత్రం స్పెషాలిటీ. ఇక ఇదే రోజు రాజీవ్ కనకాల నట వారసుడు రోషన్ కనకాల 'మోగ్లీ 2025'(Mowgli 2025)తో సందడి చేయనున్నాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగాప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడం మోగ్లీ ప్రత్యేకత. ఇక పాటల ప్రపంచంలో రారాజు, అమరజీవి 'ఘంటసాల'(Ghantasala)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఘంటసాల' చిత్రం కూడా 12 నే అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి ముస్తాబవుతుంది.


Also Read:akhanda 2 : తగ్గేదేలే

దీంతో 'ఘంటసాల' నామధేయంతో థియేటర్స్ మారుమోగనున్నాయి. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ పోషించాడు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న నందు హీరోగా తెరకెక్కిన సైక్ సిద్దార్ధ్ కూడా 12 నే సందడి చేయనుంది. ఈషా, నా తెలుగోడు, ఇట్స్ ఓకే గురు, మిస్ టీరియస్ అనే మరో నాలుగు చిత్రాలు కూడా ఇదే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించనున్నాయి. ఈ నాలుగు చిత్రాలు భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కడం మూవీ లవర్స్ కి కలిసొచ్చే అంశం. దీంతో ఒకే రోజు ఎనిమిది చిత్రాలు రావడంతో సినీ సర్కిల్స్ లో కూడా పండగ వాతావరణం వచ్చినట్లయ్యింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.