English | Telugu

47 ఏళ్ల హీరోకి జోడిగా సాయి పల్లవి!.. ఫ్యాన్స్ ఏమంటారో మరి 


-ఎవరు ఆ హీరో
-ఫ్యాన్స్ ఏమంటారో
-సాయి పల్లవి ఛరిష్మానే వేరు

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'సాయిపల్లవి'(Sai Pallavi)చరిష్మాకి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. చాలా కాలం తర్వాత హీరోయిన్ ని చూసి సినిమాకి వెళ్లే రేంజ్ ని సంపాదించి హీరోయిన్ కట్ అవుట్ కి గుర్తింపుని తీసుకొచ్చింది. అందుకే అనతికాలంలోనే ప్రపంచ సినీ విశ్లేషకులు ఔరా అనుకునే రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లి క్యారక్టర్ ని పోషిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam)'థగ్ లైఫ్' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని 'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సదరు చిత్రం గురించి అధికార ప్రకటన రానుంది. విజయ్ సేతుపతి సరసన 'సాయి పల్లవి'ని మేకర్స్ హీరోయిన్ గా ఎంపిక చేశారనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గాని సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు విజయ్ సేతుపతి వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన కట్ అవుట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దీంతో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి సెట్ అవుతుందా కూతురిగా ఉంటుందనే కామెంట్స్ ని కొందరు చేస్తున్నారు.

also read:సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా!

మరికొంత మంది మాత్రం ఈ విషయంపై స్పందిస్తు విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబో కొత్తగా ఉంటుందని, ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో తేడా ఉన్నా, సినిమా అనే అద్భుతమైన దృశ్య కావ్యం ఆ ఛాయలు కనపడకుండా చేస్తుందని అంటున్నారు.పైగా సాయి పల్లవి, మణిరత్నం కూడా తమ ప్రతిభతో మెస్మరైజ్ చెయ్యడంలో దిట్ట అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథగా మణిరత్నం తెరకెక్కిస్తుండటం మరో స్పెషల్. విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు.