English | Telugu

సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా! 

-ఎవరు విజేత
-మొత్తం ఎన్ని సినిమాలో తెలుసా!
-అభిమానులు ఏమంటున్నారు
-సంక్రాంతి ఎప్పుడు మొదలు

సంవత్సరం పొడవున సినిమాల మధ్య పోటీ అనేది వస్తూనే ఉంటుంది. కాని సంక్రాంతికి ఏర్పడే పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు, మూవీ లవర్స్ కి కూడా సదరు పోటీ మంచి కిక్ ని ఇస్తుంది. సంక్రాంతి హుంగామాకి ముహూర్తం దగ్గర పడుతుండటంతో సదరు కిక్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాలు పందెం కోళ్ల లాగా ముస్తాబవుతున్నాయి. దీంతో సంక్రాంతి విజేతగా ఏ మూవీ నిలుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఏ ఏ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయో చూద్దాం.

ముందుగా పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)జనవరి 9 న 'రాజాసాబ్'(The Rajasaab)తో సంక్రాంతి పందానికి అంకురార్పణ చేయనున్నాడు. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తుండటంతో పాటు, ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ థ్రిల్లర్ చేస్తుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో రాజా సాబ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉండటంతో రిజల్ట్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక ఇదే రోజు మరో పాన్ ఇండియా స్టార్' ఇళయ దళపతి విజయ్'(VIjay)వన్ మాన్ షో 'జననాయగాన్'(Jananayagan)వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కగా విజయ్ ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతుంది. దీంతో జననాయగాన్ ని ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో జననాయకుడు అనే టైటిల్ తో విడుదల కానుండగా అభిమానులు , ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad garu)తో సంక్రాంతి సందర్భంగానే ల్యాండ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.

అధికారకంగా డేట్ ని ప్రకటించకపోయినా సంక్రాంతికి రెండు రోజుల ముందే రానుందనేది టాక్ . చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో పాటు సాంగ్స్, ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని ఏర్పాటు చేసుకుంది. పైగా వరుసహిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. దీంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.

ఇక మాస్ మహారాజ రవితేజ(Ravi teja)కూడా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో సంక్రాంతి కుర్చీ పై కన్నేశాడు. రవితేజ స్టైల్లో నే మాస్ అంశాలుతో పాటు ఈ సారి ఫ్యామిలీ అంశాలు కూడా ఒక రేంజ్ లోనే ఉండనున్నాయి. దీంతో సంక్రాంతికి అందరు సందడి చేసే ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా సినీ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది.ఇక సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అన్నట్టుగా శర్వానంద్(sharwanand)మరో ఫ్యామిలీ మూవీ 'నారి నారి నడుమ మురారి'తో అడుగుపెట్టనున్నాడు. గతంలో సంక్రాంతి సమయంలో పెద్ద హీరోలతో పోటీపడి శర్వానంద్ రెండు సార్లు విజయాన్ని అందుకోవడంతో 'నారినారినడుమమురారి' పై ఆసక్తి నెలకొని ఉంది.

also read: ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు

ఇక పండగరోజైన 14 న 'పరాశక్తి' తో శివ కార్తికేయన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు. విభిన్న చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' తో సందడి చేయనున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి సినిమాల ఫలితంపై అభిమానుల్లోఆసక్తి నెలకొని ఉంది. మూవీ లవర్స్ మాత్రం అన్నిచిత్రాలు తమని అలరించాలని కోరుకుంటున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.