English | Telugu

మార్చిలో ప‌వ‌ర్‌స్టార్ సినిమా.. ఆ సినిమాల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదా?

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమాను పూర్తి చేయ‌డం ఒక ఎత్త‌యితే దాన్ని రిలీజ్ చెయ్య‌డం మ‌రో ఎత్తుగా మారింది. ఎందుకంటే ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వ‌క‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ప‌దే ప‌దే వాయిదా ప‌డుతున్నాయి. అలా వాయిదా ప‌డ‌డం వ‌ల్ల అంత‌కుముందే రిలీజ్‌ని ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇబ్బందుల్లో ప‌డుతున్నాయి.

ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) సినిమా వ‌ల్ల ఎదురు కాబోతోంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసి ఉన్నాయి. ఆ సినిమాల మ‌ధ్య‌లోకి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా వ‌చ్చి చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ చేస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ అదే నెల‌లో రిలీజ్ చెయ్య‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ ఏడాది హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజి సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ప‌వ‌న్ వ‌చ్చే ఏడాది మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ మూవీ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే మార్చిలో నాని హీరోగా న‌టిస్తున్న ప్యార‌డైజ్ మార్చి 26, రామ్‌చ‌ర‌ణ్ హీరోగా చేస్తున్న పెద్ది మార్చి 27న రిలీజ్ కాబోతున్నాయి. అయితే ప‌వ‌న్ సినిమా కూడా మార్చి 27కే రాబోతోంద‌నే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన చ‌ర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ చిత్రాన్ని ఆ డేట్‌కి రిలీజ్ చేసే ఆలోచ‌న యూనిట్‌కి లేద‌నే వార్త కూడా మ‌రో ప‌క్క చ‌క్క‌ర్లు కొడుతోంది. అదే నెల‌లో సినిమాను రిలీజ్ చేసే ప‌క్షంలో రెండు వారాల ముందుగానే సినిమాని థియేల‌ర్ల‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాను మార్చిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.