English | Telugu
తెలుగువారిని తక్కువ చేశాడు
Updated : Jun 24, 2013
హీరోగా తనకు తిరుగులేని గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులను కించపరుస్తూ చెన్నైలో సిద్దార్ధ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. వైవిధ్య భరిత చిత్రాలను తెలుగువారు ఆదరించరని, అగ్ర హీరోలు నటించే మాస్ మసాలా ఎంటర్‌టైనర్స్‌ను మాత్రమే తెలుగువారు ఆదరిస్తారని తమిళ మీడియా ముందు సిద్దార్ధ కూసాడు. ఇంతకుముందు కూడా తెలుగు ఫిలిం క్రిటిక్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్దార్ధ్.. ఆపై బహిరంగ క్షమాపణలు కోరి సంధి చేసుకొన్నాడు. స్వతహా తమిళుడైన సిద్దార్ధ్.. తమిళ మీడియాను ప్రసన్నం చేసుకోవడానికి.. ఓ ప్రత్యేక "విందు సమావేశం" ఏర్పాటు చేశాడు.
ఆ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి మాట్లాడాడు. శంకర్ "బాయ్స్" చిత్రం ద్వారా హీరోగా మారిన సిద్దార్ధ్‌ను తమిళ ప్రేక్షకులు తరిమికొట్టగా.. తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. "నువ్వొస్తానంటె.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు" చిత్రాలతో అందలం ఎక్కించుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో తన మాతృభాష తమిళంలోనూ తనకు మార్కెట్ ఏర్పరుచుకునేందుకు సిద్దార్ధ్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా.. "ఎన్.హెచ్ _", సమ్‌థింగ్.. సమ్‌థింగ్" చిత్రాలను తమిళంలోనూ ఏకకాలంలో షూట్ చేసి విడుదల చేసాడు. అప్పట్నుంచి తమిళ ఆడియన్స్‌ను, మీడియాను కాకా పడుతూ.. తెలుగు ఆడియన్స్‌ను, మీడియాను చులకన చేసి మాట్లాడుతున్నాడు!