English | Telugu

ఆ ఛాన్స్ ఎవరిది?

వచ్చే ఏడాది అఖిల్ సినిమా విడుదలవుతుందని అభిమానుల సమక్షంలో "అడ్డా" ఆడియో వేదికపై నాగార్జున అక్కినేని అధికారికంగా ప్రకటించిన మరుక్షణం నుంచి.. "అఖిల్ ఆరంగేట్రం చేసే చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు?" అనే ఆసక్తికర చర్చ అంతటా మొదలైపోయింది.

అఖిల్ పరిచయ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున నటించిన "రాజన్న" చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి నేతృత్వం వహించినప్పటి నుంచి ప్రచారంలో ఉన్న ఈ ఊహాగానాలు ఇప్పుడు ఉధృతం కానున్నాయి.

"బాహుబలి" అనంతరం రాజమౌళి ఇంకా ఏ హీరోతోనూ కమిట్ కాలేదు. ఘనమైన వారసత్వం కలిగిన కుర్రాడిని కథానాయకుడిగా పరిచయం చేయడం ఏ దర్శకుడైనా ప్రతిష్టాత్మకంగా తీసుకొంటాడు. వెంకటేష్, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లను హీరోలుగా పరిచయం చేసిన కె.రాఘవేంద్రరావు శిష్యుడైన రాజమౌళి కూడా తన గురువు బాటలో నడుస్తున్నాడేమో వేచి చూడాల్సిందే!