English | Telugu

కత్తి పట్టిన శ్రీకాంత్ పిల్లలు

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "రుద్రమదేవి". గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ కూతురు, కుమారుడు నటించనున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రుడి (రానా) యొక్క 14 ఏళ్ల వయసులోని పాత్రలో హీరో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ నటిస్తుండగా, రుద్రమదేవి (అనుష్క) 9 ఏళ్ల వయసులో శ్రీకాంత్ గారి కూతురు మేధ నటిస్తున్నారు. దీనికోసం వీళ్ళిద్దరికీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాల్లో శిక్షణ ఇస్తున్నారు అని తెలిపారు. ఇప్పటికే 45 శాతం పూర్తయ్యింది. ఆగస్టు 1వ తేది నుండి మూడో షెడ్యుల్ ప్రారంభం అవుతుందని తెలిపారు.