English | Telugu

టార్గెట్.. డబుల్ సెంచరీ !

"మహాత్మా" చిత్రంతో సెంచరీ పూర్తి చేసిన శ్రీకాంత్.. మరో రెండు మూడేళ్లో డబుల్ సెంచరీ కూడా చేసేయాలని డిసైడ్ అయిపోనట్లున్నారు. తన కాల్షీట్స్ డైరీని ఒక్కరోజు కూడా ఖాళీ ఉంచకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు.

ప్రస్తుతం "మొండోడు", "ఆచార్య", "నాటుకోడి", "హంటర్" చిత్రం షూటింగ్స్‌తో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉన్న శ్రీకాంత్ తాజాగా మరో చిత్రం అంగీకరించాడు. రైటర్ ఉదయ్‌రాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

శ్రీకాంత్ నటించిన సినిమా హిట్టయి కొన్ని "యుగాలు" గడిచిపోయాయి. అయినాసరే.. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అన్న అత్యాశతో అతనితో వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. శ్రీకాంత్‌కు ఇప్పటికే కోటిన్నర వరకు శాటిలైట్ మార్కెట్ ఉండడం...రెమ్యూనరేషన్ విషయంలో పంతాలకు పోయే మనస్తత్వం శ్రీకాంత్‌కు లేకపోవడం వంటి కారణాలు శ్రీకాంత్‌కు వరుసగా సినిమాలు వచ్చేలా చేస్తున్నాయి!