English | Telugu

బలుపులో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. అయితే ఈ మధ్య వస్తున్న అన్ని టాప్ హీరో చిత్రాలలో పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవడం మాములైపోయింది.

ఇటీవలే బన్నీ హీరోగా నటించిన "ఇద్దరమ్మాయిలతో" చిత్రంలో కూడా బ్రహ్మానందం ఒక సీన్ లో "ప్రపంచంలో అందరూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ యేనా" అని వాడేసుకున్నారు. తాజాగా రవితేజ హీరోగా నటించిన చిత్రం "బలుపు". గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే(జూన్ 28న) విడుదలైనది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని అక్కడి నుండి తప్పించుకుంటాడు.

ఈ విధంగా ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ పేరును దర్శక నిర్మాతలు తమ సినిమాలో ఎక్కడో ఒక సీన్లో వాడేసుకుంటున్నారు. దీంతో ఆ హీరో అభిమానులతో పాటు, పవన్ ఫాన్స్ కూడా తమ సినిమాకు ప్లస్ అవుతారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.