English | Telugu
ఇళయరాజాతో శృతి హాసన్ బ్యూటిఫుల్ మెమరీ అదేనంట
Updated : Oct 30, 2025
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సెమీ ఫినాలే ఎపిసోడ్ లో శృతి హాసన్ ఇళయరాజా గారితో ఉన్న తన అనుబంధం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. "శృతి మేడం...మీరు చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు కదా మీ ఫస్ట్ మెమరబుల్ అండ్ మీ మనసుకు దగ్గరైన ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి ? అని సృష్టి చిల్లా అడిగింది. "ఇంట్లో నాన్నగారు ఎప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు. మా ఇంట్లో మొత్తం మ్యూజిక్ ఉంది. ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ గుర్తుండే మెమరీ నా ఫస్ట్ రికార్డింగ్ అది కూడా ఇళయరాజా సర్ తో జరిగింది నా ఐదేళ్ల వయసులోనే. ఆ వయసులో నాకు ఆ రికార్డింగ్ గురించి దాని వేల్యూ గురించి నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఐతే నాకు ఒక విషయం బాగా గుర్తుంది.
ఆ మైక్రోఫోన్ ఏకెజి మైక్ లో ఒక హార్ట్ లాంటి ఒక సింబల్ ఉంది. అప్పటి నా చిన్న బుర్రకి అర్ధమైన విషయం ఏంటంటే మైక్ లో హార్ట్ ఉందా..ఐతే ఐ లైక్ సింగింగ్. అలా రికార్డింగ్ చేశా. మన జీవితంలో మనం ప్రేమించే ఏ విషయమైనా సింపుల్ గా ఒక మ్యాజికల్ గానే స్టార్ట్ అవుతుంది. ఈరోజున ఇళయరాజా గారి గురించి ఆలోచిస్తున్నా కానీ ఆ రోజున నేను చిన్నపిల్లను కదా క్యాజువల్ గా వెళ్లి పాట పాడి వచ్చేసాను. రీసెంట్ గానే నేను ఆయన్ని వెళ్లి కలిసాను. చిన్నప్పుడు ఆయనతో నాకు ఉన్న బ్యూటిఫుల్ మెమరీ అదే అలాగే ఆయనకు పాడడం కూడా. ఇంతవరకు కూడా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. నా వయసు ఎంతైనా కానీ నన్ను చూస్తే మాత్రం ఆయన కుట్టిపాప శృతి లానే చూస్తారు అలాగే మాట్లాడతారు. అలాంటి ఒక మనిషి లైఫ్ లో ఉండడం నిజంగా గొప్ప విషయం" అని చెప్పింది శృతి హాసన్.